రాష్ట్ర స్థాయి పోటీలను ఎంపిక | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి పోటీలను ఎంపిక

Published Mon, Dec 5 2016 11:19 PM

రాష్ట్ర స్థాయి పోటీలను ఎంపిక - Sakshi

తురకలాపట్నం(రొద్దం) : తురకలాపట్నం జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల హెచ్‌ఎం జ్యోతిలత, పీఈటీ శ్రీదేవి సోమవారం తెలిపారు. ఈనెల 4న అనంతపురం ప్రభుత్వ బాలురు జూనియర్‌ కళాశాలలో నిర్వహించిన ఎంపికలో పద్మావతి, బాలాజిలు ప్రతిభ చూపారన్నారు. వీరు పశ్చిమగోదావరిలో ఈనెల 8న జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారన్నారు. అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో జరిగిన క్రీడా పోటీల్లో తమ విద్యార్థులు సత్తాచాటినట్లు తెలిపారు. బాలికల జూనియర్స్‌ విభాగం బాల్‌బ్యాడ్మింటన్‌లో విన్నర్స్‌గా, సాఫ్ట్‌బాల్‌, టెన్నీకాయిట్‌లో రన్నర్స్‌గా గెలుపొందినట్లు తెలిపారు. బాలుర సీనియర్స్‌ కబడ్డీ, టెన్నీకాయిట్‌లలో రన్నర్స్ నిలిచినట్లు పేర్కొన్నారు. పెద్దమంతూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు సచిన్‌టెండుల్కర్‌–6 జోన్‌ క్రీడాపోటీల్లో జూనియర్స్, సీనియర్స్‌ బాలబాలికల విభాగాల్లో 13 పతకాలు, 3 ట్రోఫీలు గెలుపొందినట్లు పాఠశాల హెచ్‌ఎం విజయకుమారి, పీఈటీ లక్ష్మినారాయణ తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement