Sakshi News home page

భారీ వర్షం.. తప్పిన ప్రమాదం

Published Sat, Jul 1 2017 3:34 AM

భారీ వర్షం.. తప్పిన ప్రమాదం

సుల్తానాబాద్‌: మండల కేంద్రంలోని సర్కిల్‌ కార్యాలయం ముందు ఉన్నచెట్టు నేలకొరగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అప్పటి వరకు సీఐ కలిసేందుకు పలు గ్రామాల నుంచి  వచ్చి నిరీక్షించారు. ఈదురు గాలి, ఒకేసారి భారీ వర్షం రావడంతో వృక్షం పోలీస్‌స్టేషన్‌ ముందుభాగంలో ఉన్న ప్రహరీపై పడింది. సాయంత్రం కావడంతో ఎస్సై రాజు తన వసతిగృహంలో  విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సుల్తానాబాద్‌లోని అశోక్‌నగర్‌లో 33/11 కేవీ విద్యుత్‌వైరు తెగిపడింది. గ్రామపంచాయతీ కార్మికుల సహాయంతో చెట్లను తొలగించా రు. మరో రెండుకాలనీల్లో విద్యుత్‌వైర్లు తెగిపడడంతో రెండు గంటలు శ్రమించి విద్యుత్‌ను పునరుద్ధరించారు.

గాలిదుమారంతో లేచిపోయిన ఇంటి పైకప్పు
ధర్మారం: మండలంలోని కమ్మరిఖాన్‌పేటలో గురువారం రాత్రి వీచిన గాలిదుమారానికి ఒల్లాల శ్రీనివాస్‌ ఇంటి పై కప్పు రేకులు ఎగిరిపోయాయి. ఒకేసారి గాలివాన రావడంతో రేకులు పైకిలేచి ఇంటి పరిసరాల్లో పడ్డాయి. శ్రీని వాస్‌ ఇంట్లో లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దెబ్బ తిన్న ఇంటిని వీఆర్‌వో రామచంద్రం, సర్పంచ్‌ గుడివెనక లక్ష్మిమోహన్, కాదాసి మల్లేశం, గుజ్జుల వేణుగోపాల్‌రెడ్డి సందర్శించారు. శ్రీనివాస్‌ను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

వర్షానికి ఇంటిపై కూలిన చెట్టు
కాల్వశ్రీరాంపూర్‌: కాల్వశ్రీరాంపూర్‌ మండలంలోని మీ ర్జంపేటలో శుక్రవారం కురిసిన భారీవర్షానికి పంజాల శం కరయ్య ఇంటి ముందున్న చెట్టు ఇంటిపై కూలింది. ఈప్రమాదంలో రేకులు విరిగాయి. వర్షం కురిసినప్పుడు ఇం ట్లో ఎవరులేరు. వ్యవసాయ పనులకు వెల్లడంతో ఎలాం టి నష్టం జరగలేదు.

ఈదురుగాలులకు ఇళ్లు ధ్వంసం
ఓదెల: గ్రామానికి చెందిన పెనాల రాజమణి అనే మహిళకు చెందిన ఇంటిపై శుక్రవారం వీచిన ఈదురుగాలులకు చెట్టుకూలి ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో రాజమణి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. చెట్టు› కూలడంతో తన ఇళ్లు పూర్తిగా ధ్వంసమైందని, అధికారులు సాయం అందించి ఆదుకోవాలని కోరింది.

Advertisement
Advertisement