Sakshi News home page

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

Published Mon, Aug 7 2017 11:57 PM

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

తాడూరు: రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పార్టీ కార్యకర్తలు గ్రామీణ ప్రాంతాల ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. ఆదివారం తాడూరు పార్టీ కార్యాలయంలో కొత్తగా ఎంపికైన పార్టీ అధ్యక్షుడు, కమిటీ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వాలు 30 ఏళ్లు పాలించి ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. 30ఏళ్లలో సా ధించలేని అభివృద్ధి మూడేళ్లలో ము ఖ్యమంత్రి కేసీఆర్‌ చేసి చూపించారన్నారు.

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను జీర్ణించుకోలేని కాంగ్రెస్, బీజే పీ తాము కనుమరుగు అవుతున్నామనే ఉద్దేశంతో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారం కల అని, మతి భ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. టీఆర్‌ఎస్‌ పాలనలో ప్రతి వ్యక్తికి మూడు పూటలా అన్నంతో పాటు సాగు, తా గునీటితో పాటు పలు సంక్షేమ పథకాలు అందించడమే బంగారు తెలం గాణ లక్ష్యమని పేర్కొన్నారు. బంగా రు తెలంగాణ అంటే రోడ్లు, భవనాల ను బంగారంలా మార్చడం కాదని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా సుఖంగా ఉండటమే బంగారు తెలంగాణ అని అన్నారు. వచ్చే డిసెంబర్‌లోగా మిషన్‌ భగీరథ పనులు పూర్తయి ఇంటింటికి నల్లా కనెక్షన్‌ ఇస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. గతంలో ఇక్కడ మంత్రి, ఎమ్మెల్యేగా పనిచేసిన నాయకుడు బియ్యంరెడ్డిగా పేరుగాంచారని పరోక్షంగా బీజేపీ నాయకుడు నాగం గురించి ఎద్దేవా చేశారు.

జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి ప్రత్యేక శ్ర ద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి కార్యకర్త పదవులే ముఖ్యం కాకుండా పథకాల అమలు గూర్చి గ్రామీణ ప్రాంత ప్రజలకు చేరవేయాలని తెలి పారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు జక్కా రఘునందన్‌రెడ్డి, జెడ్పీటీసీ మణెమ్మ, ఎంపీపీ సుధారాణి, ఎంపీటీసీ బాల్‌చంద్రయ్య, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వెంకటయ్య, ఆయా గ్రామాల సర్పంచ్‌లు కొత్తపల్లి వెంకటయ్య, అనిల్‌రెడ్డి, వెంకటస్వామి, యార సుజాత, అనంత కృష్ణ య్య, చంద్రమౌలి  పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement