మత్తుమందిచ్చి చోరీ

20 Aug, 2015 01:15 IST|Sakshi
మత్తుమందిచ్చి చోరీ

విజయవాడ (రైల్వేస్టేషన్): ప్రయాణికులకు మత్తు మందు ఇచ్చి ముగ్గురు వ్యక్తులు చోరీకి పాల్పడిన ఘటన బుధవారం న్యూఢిల్లీ నుంచి తిరువనంతపురం వెళ్తుతున్న కేరళ ఎక్స్‌ప్రెస్(12626)రైల్లో జరిగింది. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నీలిమ సొప్పాంజి(35), మణిక్కాం(41) దంపతులు న్యూఢిల్లీ నుంచి మహారాష్ట్రలోని సేవాగ్రామ్‌కు కేరళ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరారు.

మార్గ మధ్యలో ముగ్గురు యువకులు వీరు ప్రయాణిస్తున్న ఎస్7 బోగీలో ఎక్కి, దంపతులతో మాటలు కలిపి బిస్కెట్లు ఇచ్చారు. అందులో మత్తు మందు కలిపి ఉండటంతో దంపతులు అపస్మారక స్థితికి చేరుకున్నారు. దీంతో వారి వద్ద ఉన్న లాప్‌ట్యాప్,  రూ.3,000 నగదు, బంగారపు గొలుసును చోరీ చేశారు. వీరికి మెలకువ వచ్చేసరికి రైలు వరంగల్ చేరింది. అక్కడ రైలు ఎక్కువసేపు ఆగక పోవడంతో జీఆర్పీ పోలీసులు విజయవాడ పోలీసులకు సమాచారం అందించారు. వారిని విజయవాడలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
 

మరిన్ని వార్తలు