తెగని ఇన్‌ఫుట్‌ సబ్సిడీ పంచాయితీ! | Sakshi
Sakshi News home page

తెగని ఇన్‌ఫుట్‌ సబ్సిడీ పంచాయితీ!

Published Fri, Sep 30 2016 11:03 PM

thegani input subsidi panchayati

వేంపల్లె : 2014–15 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఇన్‌పుట్‌ సబ్సిడీ మొత్తం పూర్తిస్థాయిలో రైతులకు అందలేదు. ఇప్పటికి జిల్లాలో 6,500 మందికి రూ.5 కోట్ల మేర అందాల్సి ఉంది. ఇందులో 3 వేల మంది రైతులకు రూ. 3 కోట్లు త్వరలో అందే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. మరో 3 వేల మంది రైతులకు రూ. 2 కోట్లు ఇప్పుడే వచ్చే పరిస్థితులు లేవని తెలుస్తోంది. గతంలో రెండు విడతలుగా సబ్సిడీ రైతులకు అందినప్పటికీ.. మిగిలిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. అన్ని వివరాలు సక్రమంగా ఇచ్చినప్పటికీ తమకు ఇన్‌పుట్‌ సబ్సిడీ అందడంలేదని రైతులు వాపోతున్నారు. అధికారులు మాత్రం ఆధార్‌ కార్డులలో తప్పులు, ఖాతాలు సరిగా లేవని., మరికొంత మంది ఖాతాలు క్లోజ్‌ చేశారని చెబుతున్నారు. ఇప్పటì కైనా కాలయాపన ఆపి, అధికారులు సక్రమంగా పనిచేసి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. ఒక్క వేంపల్లె మండలంలోనే 179 మంది రైతులకు సబ్సిడీ అందాల్సి ఉంది.

Advertisement
Advertisement