ప్రియురాలితో కలిసి చోరీలు... ప్రియుడి అరెస్ట్ | Sakshi
Sakshi News home page

ప్రియురాలితో కలిసి చోరీలు... ప్రియుడి అరెస్ట్

Published Wed, Sep 16 2015 1:55 PM

Thieve siva bavani arrested in visakhapatnam

విశాఖపట్నం : ప్రియురాలితో కలిసి చోరీ చేస్తూ... పోలీసులు కళ్లు కప్పి తిరుగుతున్న ఘరాన దొంగ శివ భవానిని ఎట్టకేలకు విశాఖపట్నంలో పోలీసులకు చిక్కాడు. బుధవారం పోలీసులు తనిఖీల్లో భాగంగా పీఎం పాలెం వద్ద శివ భవానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 30 తులాల బంగారం, ల్యాప్ట్యాప్తోపాటు 3 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం అతడిని పోలీసులు అరెస్ట్ చేసి... పోలీస్ స్టేషన్కి తరలించారు. శివ భవానిపై జిల్లా వ్యాప్తంగా పలు చోరీ కేసులు నమోదయ్యాయని పోలీసులు చెప్పారు. పోలీసులు నిందితుడు శివ భవానిని తమదైన శైలిలో విచారిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement