పెదతండాలో పిడుగు | Sakshi
Sakshi News home page

పెదతండాలో పిడుగు

Published Fri, Jul 29 2016 1:01 AM

Thunderbolt pedatandalo


పెదతండా (ఖమ్మం రూరల్‌): పెదతండాలోగల వేప చెట్టుపై గురువారం రాత్రి పిడుగుపడింది. ఆ చెట్టు ముందే గుగులోత్‌ మోహన్‌ అనే వ్యక్తి ఇల్లు ఉంది. ఆయన కుటుంబీకలు అప్పటివరకు ఆ చెట్టు కిందనే ఇరుగుపొరుగుతో కబుర్లాడుకున్నారు. చినుకులు పడుతుండడంతో లోనికి వెళ్లిపోయారు. ఆ తరువాత కొద్దిసేపటికి అదే చెట్టుపై పిడుగు పడడంతో మోహన్‌ కుటుంబీకులు, ఇరుగుపొరుగు వారు ఉలిక్కిపడ్డారు. ఈ పిడుగుపాటుతో అక్కడే ఉన్న మూడు బాబు అనే వ్యక్తి ఇంట్లోని టీవీ,ఫ్యాన్ల కాలిపోయాయ.

Advertisement

తప్పక చదవండి

Advertisement