త్యాగయ్య గానం అజరామరం | Sakshi
Sakshi News home page

త్యాగయ్య గానం అజరామరం

Published Fri, Jul 29 2016 12:15 AM

త్యాగరాజస్వామి మండపంలో ఎస్‌.శైలజాదీపక్, కిరణ్మయి ఉపన్యాసం

తిరుపతి కల్చరల్‌: రామభక్తితో త్యాగయ్య ఆలపించిన కృతులు, సంకీర్తనలు అజరామరమని, సమాజానికి మార్గదర్శకమని ప్రముఖ సంగీత విద్వాంసురాలు ఎస్‌.శైలజాదీపక్‌ తెలిపారు. త్యాగరాజ సంగీతోత్సవాల్లో భాగంగా గురువారం త్యాగరాజ మండపంలో ‘ప్రహ్లాద భక్త విజయం –త్యాగయ్య భక్తితత్వం’ అనే అంశంపై ఉపన్యసించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ విద్వాంసురాలు కిరణ్మయి గాత్రమందించగా, శైలజాదీపక్‌ వ్యాఖ్యానం చేశారు. వారు మాట్లాడుతూ నాడు ప్రహ్లాదుడు నారాయణ అంటూ నిత్యగానంతో భక్తితత్వాన్ని సాధించారని తెలిపారు. అలాగే త్యాగయ్య రామనామాన్ని స్మరిస్తూ సంకీర్తనలు చేసి భక్తితత్వాన్ని సాధించారన్నారు. త్యాగయ్య సంగీతాన్ని భావితరాలకు అందించేందుకు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో త్యాగరాజ ఉత్సవ కమిటీ చైర్మన్‌ బీమాస్‌రఘు, కార్యదర్శి కంచిరఘురామ్‌ అతిథులను ఘనంగా సత్కరించారు.

అలరించిన భరత్‌సుందర్‌ గాత్రం
త్యాగరాజ మండపంలో గురువారం రాత్రి చెన్నైకి చెందిన భరత్‌సుందర్‌ ఆలపించిన సంగీతం కమనీయంగా సాగింది. ఈ సందర్భంగా ‘ముఖాభిరాగంలో కలసినంతనే, కల్యాణరాగంలో అమ్మారావమ్మాసీతమ్మా అని సుమధురమైన త్యాగయ్య కృతులను గానం చేసి శ్రోతలను ఆకట్టుకున్నారు. వీరికి వయోలిన్‌పై అనంతకృష్ణన్, మృదంగంపై బాలాజీ  సహకారం అందించి రక్తికట్టించారు.
 

Advertisement
Advertisement