పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం

Published Sat, Oct 1 2016 12:09 AM

tit for tat to pakkistan

ఇటిక్యాల: ఉగ్రవాదులకు శిక్షణను ఇస్తూ, ఇండియాపై దాడులు చేసే విధంగా ఉసిగోల్పుతున్న పాకిస్తాన్‌కు ఇండియన్‌ ఆర్మీ తగిన గుణపాఠం నేర్పిందని నాగర్‌కర్నూల్‌ మాజీ ఎంపి మందా జగన్నాథం అన్నారు. శుక్రవారం సాయంత్రం కోండేరులోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అయన మాట్లాడారు. పాక్‌ ఆక్రమిత  కాశ్మీర్‌లోని ఉగ్రవాదుల శిక్షణ స్థావరాలపై ఇండియన్‌ ఆర్మీ మెరుపు దాడి చేసి దాదాపు 40 మంది ఉగ్రమూకలను మట్టు పెట్టడం హర్షనీయమన్నారు.సైనిక చర్యలకు దేశ ప్రజలు సంపూర్ణ మద్దతును  ప్రకటిస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంబడే దేశంలోని అన్ని రాజకీయ పక్షలు  నడుస్తాయని అన్నారు. ఒసామా బిన్‌ లాడేన్‌ను అమెరికా సైనిక దళాలలు పాక్‌ భూభాగంలోనే మట్టు పెట్టినట్లే ఇండియన్‌ ఆర్మీ పాక్‌ అక్రమిత కాశ్మీర్‌లో దాగివున్న ఉగ్రవాదులను మట్టు పెట్టడం జరిగిందని అన్నారు. దీంతో పాక్‌కు ఇండియా దెబ్బ ఏమిటో లె ల్సివచ్చిందన్నారు. భారత సైన్యానికి ప్రతి భారతీయుడు అండగా నిలచి దేశ భక్తిని చాటుకోవాలని మందా కోరారు.
ప్రతిపక్షలవి అడ్డగోలు వాదనలు...
రాష్ట్రంలో ప్రతిపక్షాలు అడ్డగోలు వాదనలు చేస్తున్నాయని మందా విమర్శించారు. రైతులకు సాగునీటిని అందించేందుకు తమ ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తోందన్నారు. కల్వకుర్తి ,నెట్టంపాడ్,భీమా, సంగంబండ ఎత్తిపోతల పథకాల నుంచి సాగునీటిని విడుదల చేస్తే వాటికి అడ్డంకులు సృష్టించడం తగదు అన్నారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌ నాయకులు విక్రమ్‌ సేనారెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, జయసాగర్, రాంరెడ్డి, పరశురాముడు, రామాచారి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement