సీసీఎస్‌లో టీఎంయూ హవా | Sakshi
Sakshi News home page

సీసీఎస్‌లో టీఎంయూ హవా

Published Thu, Nov 24 2016 2:25 AM

సీసీఎస్‌లో టీఎంయూ హవా

ఆదిలాబాద్ కల్చరల్ : ఆర్టీసీ సీసీఎస్(క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ) ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ డెలిగేట్ల హవా కనిపించింది. తెలంగాణ మజ్దూర్ యూనియన్ నుంచి ట్రాఫికల్  నుంచి ఎస్.విలాస్, జీఆర్ మౌళీ, రవీందర్ పోటీ పడ్డారు. స్వతంత్ర అభ్యర్థిగా మనోహన్ పోటీ చేశారు. ఎస్‌డబ్ల్యూఎఫ్ నుంచి ఎస్.ఊశన్న, ఈయూ నుంచి సత్యనారాయణ, హిరాజీ, సురేందర్, మెరుుంటనెన్స్‌కు టీఎంయూ నుంచి ఊరే ఆశన్న, ఈయూ నుంచి గట్టయ్య పోటీ చేశారు. కాగా 543 ఓట్లు ట్రాఫికల్‌కు ఉండగా, మెంటనెన్స్ ఓట్లు 98 ఉన్నాయి. ఈ ఎన్నిలను ఆర్టీసీ డీఎం సాయన్న ప్రొసిడింగ్ ఆఫీసర్‌గా, అసిస్టెంట్ ఇంజనీర్ మెకానికల్ రాజెందర్, ట్రాఫికల్ ఆఫీసర్ జానాబాయిలు ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు.  

సీసీఎస్‌లో ట్రాఫికల్ హవా...
ఆర్టీసీ సీసీఎస్ ప్రతినిధుల ఎన్నికల్లో టీఎంయూ మరోసారి హవా నిరూపించుకుంది. టీఎంయూ నుంచి ట్రాఫికల్‌లో ముగ్గురు పోటీ చేయగా టీఎంయూ నుంచి  ఎస్.విలాస్ 390 ఓట్లు, జీఆర్ మౌళీ 382 ఓట్లు, స్వతంత్య్ర అభ్యర్థి 286 ఓట్లతో విజేతలుగా నిలిచారు. టీఎంయూ అభ్యర్థి 235 ఓట్లతో ఓటమి పాలయ్యారు. ఈయూ అభ్యర్థి నారాయణ 133 ఓట్లతో పరాజయం పాలయ్యారు. కాగా ఎస్‌డబ్ల్యూఎఫ్‌కు ఊశన్నకు 71 ఓట్లు, ఈయూ నాయకుడు హిరాజీకి 11 ఓట్లు, సురేందర్‌కు 9 ఓట్లు పొలయ్యాయి. గ్యారెజ్ సెక్షన్ మెరుుంటనెన్స్ విభాగంలో టీఎంయూ అభ్యర్థి ఊరే ఆశన్న 82 ఓట్ల మెజార్జీతో ఘనవిజయం సాదించారు. కాగా పోటీ అభ్యర్థులు ఇద్దరు కె.గట్టయ్య(ఈయూ) 13 ఓట్లు, బి.నాందేవ్(ఎస్‌డబ్ల్యూఎఫ్) 0 ఓట్లతో పరాజయం పాలయ్యారు. దీంతో టీఎంయూ విజయకేతనం ఎగురవేసింది.

స్వతంత్ర అభ్యర్థి గెలుపు
ఉట్నూర్ : ఉట్నూర్ ఆర్టీసీ బస్సు డిపో సహకారం సంఘం ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. బుధవారం డిపో ఆవరణలో సహకార సంఘం ఎన్నికలు నిర్వహించగా సంతోష్‌కుమార్, సి.సతీష్, విద్యాసాగర్, సాయబ్‌రావ్, ధర్మేందర్, నాందెవ్ బరిలోకి దిగారు. డిపోలో మొత్తం 158 ఓట్లు ఉండగా 150 ఓట్లు పోలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థి సి.సతీష్ 64 ఓట్లు సాధించి సమీప అభ్యర్థి తెలంగాణ మజ్దూర్ యూనియన్‌కు చెందిన సంతోష్‌కుమార్‌పై తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ బస్సు డిపోలో విధులు నిర్వర్తిస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారంపై దృషి సారిస్తానన్నారు. తనను గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
Advertisement