ఐదోరోజు కొనసాగిన కానిస్టేబుల్‌ ఈవెంట్స్‌ | Sakshi
Sakshi News home page

ఐదోరోజు కొనసాగిన కానిస్టేబుల్‌ ఈవెంట్స్‌

Published Wed, Jul 20 2016 12:17 AM

to continue conistable events 5th day

– పర్యవేక్షణ చేసిన అదనపు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు 
మహబూబ్‌నగర్‌ క్రైం: పోలీస్‌ కొలువు సాధించడానికి పాలమూరు నిరుద్యోగ అభ్యర్థులు తీవ్రంగా కష్టపడ్డారు. జిల్లా క్రీడా మైదానంలో మంగళవారం ఐదవ రోజు నిర్వహించిన కానిస్టేబుల్‌ దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. ఎస్పీ రెమా రాజేశ్వరి పుష్కర ఘాట్లు పరిశీలన చేయడానికి వెళ్లడంతో జిల్లా అదనపు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఈవెంట్స్‌ను పర్యవేక్షణ చేశారు. ఉదయం 6గంటలకు మొదటి బ్యాచ్‌ అభ్యర్థులకు 800మీటర్ల పరుగుపోటీ ప్రారంభించారు. తర్వాత నాలుగు రకాల దేహదారుఢ్య పరీక్షలు చేశారు. 800మీటర్ల పరుగు విభాగంలో 93బ్యాచ్‌లకు పోటీ నిర్వహించారు. దీంట్లో మొత్తం 796మంది అభ్యర్థులు పాల్గొన్నారు. వారిలో 550మంది ఇతర నాలుగు రకాల ఈవెంట్స్‌కు అర్హత సాధించారు. అదేవిధంగా నాలుగు రకాల దేహదారుఢ్య పరీక్షలకు 524మంది పురుషులు, 103మంది మహిళలు హాజరయ్యారు. వీరిలో 425మంది పురుషులు, 89మంది అమ్మాయిలు తుది రాత పరీక్షకు అర్హత సాధించారు. ఐదు రోజులుగా రాత పరీక్ష కోసం 1498మంది పరుషులు, 302మంది అమ్మాయిలు ఎంపికయ్యారు.  

Advertisement
Advertisement