అంతర్జాతీయ స్థాయిలో పేరు తీసుకురావాలి | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ స్థాయిలో పేరు తీసుకురావాలి

Published Fri, Aug 19 2016 12:48 AM

To get to the name international level

సూర్యాపేట  సూర్యాపేట మున్సిపాలిటీకి అంతర్జాతీయ స్థాయిలో పేరుప్రఖ్యాతులు తీసుకురావాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గండూరి ప్రవళిక అన్నారు. గురువారం సూర్యాపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికులకు రక్షాబంధన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై సుమారు 200 మంది పారిశుద్ధ్య కార్మికులకు రాఖీ కట్టిన అనంతరం  ప్రసంగించారు. కార్మికుల్లో సోదరభావం పెంపొందించడంతో పాటు ప్రజల్లో పారిశుద్ధ్య కార్మికుల పట్ల గౌరవం పెరిగే విధంగా కృషి చేస్తున్నామన్నారు. కార్మికులు నిత్యం పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషిచేస్తున్నారని వారిని సోదరసోదరీమణులుగా భావించి తెలంగాణ రాష్ట్రంలోనే ప్రప్రథమంగా సూర్యాపేట మున్సిపాలిటీ తరపున రక్షాబంధన్‌ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఇదే స్ఫూర్తితో కార్మికులు పారదర్శకంగా పనిచేసి తమ విధులను నిర్వహించి మున్సిపాలిటీకి అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు తమ వంతు బాధ్యత నెరవేర్చాలని తెలిపారు. సీఎం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారన్నారు. ఇచ్చిన మాట తప్పే వ్యక్తి సీఎం కేసీఆర్‌ కాదన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందికి జీఓ 14 ప్రకారం పెంచిన వేతనాన్ని బకాయిలతో సహా చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ చైర్‌పర్సన్‌ గండూరి ప్రవళికకు టీఆర్‌ఎస్‌కేవీ నాయకులు సయ్యద్‌ సమ్మి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు గండూరి ప్రకాష్, వైస్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల లక్ష్మి, ఆకుల లవకుశ, బైరు దుర్గయ్యగౌడ్, షేక్‌ తాహేర్‌పాషా, రంగినేని ఉమ, వల్దాసు దేవేందర్, రాంబాయమ్మ, రాధిక, నర్సింహ, స్వరూపరాణి, మున్సిపల్‌ అధికారులు రాంచందర్, విద్యాసాగర్, విజయేందర్‌రెడ్డి, వెంకటేశ్వరరావు, సారగండ్ల శ్రీనివాస్, సూర్గి శంకర్‌గౌడ్, గౌస్, సయ్యద్‌సమ్మి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement