12 శాతం రిజర్వేషన్లు కల్పించాలి | Sakshi
Sakshi News home page

12 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

Published Fri, Oct 7 2016 10:34 PM

12 శాతం రిజర్వేషన్లు కల్పించాలి - Sakshi

మోత్కూరు : జనాభా దామాషా ప్రకారం మాదిగలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి కోరారు. శుక్రవారం మోత్కూరులోని జగ్జీవన్‌రామ్‌ చౌరస్తాలో తెలంగాణ మాదిగ జేఏసీ జెండాను పిడమర్తి రవి ఆవిష్కరించి మాట్లాడారు. ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించాలన్నారు. వచ్చేనెల 13న హైదరాబాద్‌ నిజాం కళాశాలలో మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మాదిగల శక్తి ప్రదర్శనను సత్తా చాటుతామని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఎస్సీవర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలైన వర్గీకరణ ఊసెత్తడంలేదని ఆరోపించారు. శీతాకాల సమావేశాల్లో వర్గీకరణ బిల్లును ఆమోదింపజేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మాదిగజేఏసీ రాష్ట్రచైర్మన్‌ గద్దల అంజిబాబు, నాయకులు చేడె మహేందర్, చేడె మధు, మిట్టగడుపుల లరమేష్, సైదులు, నవీన్, నరేష్, సురేష్, శోభన్, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement