లీకేజీ బాధ్యులపై చర్య తీసుకోవాలి : ఆదిరెడ్డి | Sakshi
Sakshi News home page

లీకేజీ బాధ్యులపై చర్య తీసుకోవాలి : ఆదిరెడ్డి

Published Sun, Jul 31 2016 8:13 PM

లీకేజీ బాధ్యులపై  చర్య తీసుకోవాలి : ఆదిరెడ్డి

నేరేడుచర్ల : ఎంసెట్‌–2 పేపర్‌ లీకేజీ బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మల్లెపల్లి ఆదిరెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదివారం నేరేడుచర్లలో నిర్వహించిన సీపీఐ 6వ మండల మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ అసమర్థత వలన పేపర్‌ లీకేజీ అయిందని సంబంధిత మంత్రులు, ఎంసెట్‌ కన్వీనర్‌ను వెంటనే రాజీనామా చేయాలన్నారు. పేపర్‌ లీకేజీపై సీబీఐచే విచారణ జరిపించాలన్నారు. రాష్ట్రంలో ప్రజా స్వామ్య పద్ధతిలో కాకుండా అఖిలపక్ష సలహాలు తీసుకోకుండా నియంతృత్వ ధోరణితో పాలన నిర్వహిస్తుందన్నారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నిర్మాణంలో భూములు కోల్పొతున్న వారికి 2013 చట్టం ప్రకారం పునరావాసం కల్పించి అన్ని వసతులు కల్పించాలన్నారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలుచేయకుండా ప్రజలను మోసగిస్తుందన్నారు. ఈ సమావేశంలో సీపీఐ నియోజకవర్గ ఇన్‌చార్జి గన్నా చంద్రశేఖర్‌రావు, నేరేడుచర్ల, హుజుర్‌నగర్, దామరచర్ల మండల కార్యదర్శులు డి. ధనుంజయనాయుడు, పాలకూరి బాబు, రాతిక్రింది సైదులు, దొడ్డా నారాయణరావు, కుందూరు సత్యనారాయణరెడ్డి, బాదె నర్సయ్య, అంబటి భిక్షం, లక్ష్మీ, సత్యానంద, కత్తి శ్రీనివాస్‌రెడ్డి, చిలకరాజు శ్రీను, సింహాద్రి, జాన్‌ తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement
Advertisement