కొనసాగుతున్న వైద్యశిబిరం | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న వైద్యశిబిరం

Published Thu, Sep 8 2016 1:01 AM

కొనసాగుతున్న వైద్యశిబిరం - Sakshi

కొండకిందిగూడెం(కేతేపల్లి):
విషజ్వరాల బారిన పడిన మండలంలోని కొండకిందిగూడెం గ్రామంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న వైద్యశిబిరం బుధవారం కొనసాగింది. ఈసందర్భంగా వైద్యశిబిరానికి వచ్చిన వారికి సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించారు. జ్వర లక్షణాలు ఉన్నట్లుగా గుర్తించిన వారిని మెరుగైన వైద్యం కోసం 108 అంబులెన్స్‌లో నకిరేకల్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డుకు తరలించారు. వైద్య శిబిరంలో మండల వైద్యాధికారి లక్ష్మీకాంత్, సీహెచ్‌వో సుందర్‌నాయక్, వైద్య సిబ్బంది జగదీశ్వర్‌రెడ్డి, దయామణి,సుజాత పాల్గొన్నారు.
కళాజాతా ప్రదర్శనలు
తెలంగాణ సాంస ్కతి కళాకారుల ఆద్వర్యంలో బుధవారం గ్రామంలో సీజనల్‌ వ్యాదులపై ప్రజలకు అవగాహన కల్పించారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంల వల్ల కలిగే అనర్థాలను తమ ఆట పాటల ద్వారా ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో బండపాలెం సర్పంచి వి.రాము, తెలంగాణ సాంస ్కతిక సారధి జిల్లా కోఆర్డినేటర్‌ వేముల నరేష్,టీం లీడర్‌ వేముల పుష్ప, కళాకారులు ఈర్ల సాయి, డప్పు శంకర్, స్రవంతి, ఇందిర, నిర్మల, రాధ, లావణ్య పాల్గొన్నారు.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement