నేటి నుంచి స్నూకర్, బిలియర్డ్స్‌ టోర్నమెంట్‌ | Sakshi
Sakshi News home page

నేటి నుంచి స్నూకర్, బిలియర్డ్స్‌ టోర్నమెంట్‌

Published Thu, Oct 6 2016 8:56 PM

today snookers game tornament

బోట్‌క్లబ్‌(కాకినాడ):
రాష్ట్రస్థాయి జూనియర్, సీనియర్‌ స్నూకర్, బిలియర్డ్స్‌ ర్యాంకింగ్‌–2016 పోటీలు స్థానిక టౌన్‌హాల్‌లో ఈ నెల 7నుంచి 16వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పోటీలు శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతాయని టోర్నమెంట్‌ కమిటీ ప్రతినిధి పీవీ రాజీవ్‌ తెలిపారు. ఈ టోర్నమెంట్‌ను టౌన్‌హాలు అధ్యక్షుడు యార్లగడ్డ వీర్రాజు, కార్యదర్శి జ్యోతుల రాము, వైస్‌ ప్రెసిడెంట్‌ డీవీఎన్‌ రాజు, బిలియర్డ్స్‌ సెక్రటరీ వి.తరుణ్‌కుమార్‌ ప్రారంభిస్తారని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల నుంచి క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొంటున్నారని, వీరికి వసతి సదుపాయాలు టోర్నమెంట్‌ కమిటీ సమకూరుస్తుందని తెలిపారు.
 

Advertisement
Advertisement