రేపు శ్రీశైలంలో పుష్కర ప్రారంభ పూజ | Sakshi
Sakshi News home page

రేపు శ్రీశైలంలో పుష్కర ప్రారంభ పూజ

Published Thu, Aug 11 2016 5:26 PM

tomorrow pushkara opening pujas

శ్రీశైలం:  కృష్ణా పుష్కరాలు శుక్రవారం ప్రారంభమవుతుండడంతో అదేరోజు వేకువజామున దేవస్థానం వారు పాతాళగంగ నదీమాతల్లికి ప్రథమ పూజ నిర్వహించడానికి ఉదయం 5.30గంటలకు ముహూర్తాన్ని నిర్ణయించినట్లు ఈవో నారాయణ భరత్‌ గుప్త తెలిపారు. అర్చకులు, వేదపండితుల సలహా మేరకు వేకువజామున 4గంటలకు ఆలయ రాజగోపురం నుంచి మంగళవాయిద్యాలతో ఉభయదేవాలయాల ప్రధానార్చకులు, వేదపండితులు, అధికారులు పూజాద్రవ్యాలు, వస్త్రాలను తీసుకుని ఆలయం నుంచి బయలుదేరుతారని అన్నారు. ఆ తరువాత కార్యక్రమ వివరాలు ఇవి...
శుక్రవారం ఉదయం 5.30గంటలకు... నదీమాతల్లికి పూజాధికాలు, సారె సమర్పణ
6.40గంటలకు కృష్ణానదీ జలాలతో పాతాళేశ్వరస్వామికి అభిషేకం
7గంటలకు కృష్ణానదీ జలాలచే నంది మండపంలోని నందీశ్వరుడికి అభిషేకాది అర్చనలు
7.25 గంటలకు క్షేత్రపాలకుడైన  వీరభద్ర స్వామికి కష్ణా జలంతో అభిషేకం 
7.40గంటలకు కృష్ణా జలాలతో ఆలయ ప్రదక్షిణ చేసి శ్రీమల్లికార్జున స్వామివార్లకు ఆజలంతో అభిషేకాది ప్రత్యేక పూజలు
 

Advertisement

తప్పక చదవండి

Advertisement