మనమే టాప్ | Sakshi
Sakshi News home page

మనమే టాప్

Published Sat, Apr 23 2016 4:03 AM

మనమే టాప్ - Sakshi

ఇంటర్ ఫలితాల్లో జిల్లా ప్రభంజనం
ప్రథమ, ద్వితీయంలో రాష్ట్రంలో ఫస్టు
ఫస్టియర్‌లో 68.54 శాతం,
సెకండియర్‌లో 75.79శాతం ఉత్తీర్ణత
ఫలితాల్లో బాలికలే ముందంజ బాలికలదే హవా..

 ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాల్లో బాలికలదే హవా. ఫస్టియర్లో బాలురు 58,274 మంది పరీక్ష రాస్తే 37,664 (64.63%) మంది పాసయ్యారు. 50,350 మంది బాలికలు పరీక్ష రాస్తే 36,878 (73.24%) మంది పాసయ్యారు. సెకండియర్‌లో 50,908 మంది బాలురు పరీక్ష రాయగా 37,311 మంది పాసై 73.29శాతం ఉత్తీర్ణత సాధించారు. 45,091 మంది బాలికలకు 35,448 మంది పాసై 78.61శాతం ఉత్తీర్ణత సాధించారు.

ఇంటర్ ఫలితాల్లో జిల్లా ప్రభంజనం సృష్టించింది. ఫస్టియర్, సెకండియర్‌లో మెరుగైన ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలోనే మొదటివరుసలో నిలిచింది. శుక్రవారం విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ పరీక్షల్లో జిల్లానుంచి అత్యధిక సంఖ్యలో విద్యార్థులు హాజరు కాగా.. అందులో ఉత్తీర ్ణత రికార్డుస్థాయిలో నమోదైంది. మొదటి సంవత్సరంలో 68.54శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, రెండో సంవత్సరంలో 75.79 శాతం విద్యార్థులు పాసయ్యారు.

సాక్షి, రంగారెడ్డి జిల్లా :  గతేడాది ఇంటర్మీడియెట్ ఫలితాలను పరిశీలిస్తే తాజాగా వచ్చిన ఫలితాలు మెరుగైనవి కావని చెప్పొచ్చు. ఇంటర్ ఫస్టియర్‌కు సంబంధించి 2015-16 వార్షికంలో 1,08,624 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. వీరిలో 74,453 మంది పాసై 68.54శాతం ఉత్తీర్ణత సాధించారు. 2014-15 వార్షికంలో ఉత్తీర్ణత శాతం 70.59 నమోదు కాగా.. ఈ ఏడాది ఉత్తీర్ణత 2.05% తగ్గింది. అయితే ఇంటర్ ద్వియంలో మాత్రం ఫలితాల నమోదు కాస్తంత మెరుగుపడింది. 2015-16 వార్షికంలో ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి 95,999 మంది పరీక్షలకు హాజరు కాగా, 72,759 మంది పాసై 75.79శాతం ఉత్తీర్ణత సాధించారు. 2014-15లో ఉత్తీర్ణత శాతం 74.93% నమోదు కాగా.. ఈ ఏడాది 0.86% మెరుగుపడింది.

Advertisement
Advertisement