గిరిజన విద్యార్థినులకు లైంగిక వేధింపులు | Sakshi
Sakshi News home page

గిరిజన విద్యార్థినులకు లైంగిక వేధింపులు

Published Mon, Jan 30 2017 11:56 PM

గిరిజన విద్యార్థినులకు లైంగిక వేధింపులు

  • ఏటీడబ్ల్యూఓ, బొమ్మూరు ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం సస్పెన్ష¯ŒS
  • క్రిమినల్‌ కేసుకు అధికారుల ఆలోచన
  • పటిష్టమైన చర్యలు తీసుకోవడంలో విఫలం
  • గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థినులకు రక్షణ కరువైంది. విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో వేధింపులకు పాల్పడిన ఉద్యోగులు పెండింగ్‌ విచారణ పేరుతో తిరిగి ఉద్యోగాలు పొందుతున్నారు.                      
    – రంపచోడవరం
     
    ఏజెన్సీలో గిరిజన విద్యార్థినిలు లైగింక వేధింపులకు గురైన సంఘటనలు అనేకం చోటుచేసుకున్నా పటిష్టమైన చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. రాజమహేంద్రవరంలోని బొమ్మూరు గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల నుంచి విద్యార్థినులను మైదాన ప్రాంత ఏటీడబ్ల్యూఓగా పని చేస్తున్న కృష్ణమోహ¯ŒS ఇంటికి తీసుకువెళ్లుతున్నారని అందుకు సహకరించిన హెచ్‌ఎం సత్యనారాయణను సస్పెండ్‌ చేశారు. తల్లిదండ్రులు విద్యార్థినులు లైగింక వేధింపులకు గురైనట్లు రంపచోడవరంలోని అధికారులకు ఫిర్యాదు చేసే వరకు అక్కడ పరిస్థితిపై గిరిజన సంక్షేమ అధికారులు పట్టించుకోలేదు. కనీసం బాలికల ఆశ్రమ పాఠశాలల్లో మహిళ వార్డె¯ŒS నియమించడంలో కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. బాలికల పాఠశాలల్లో  మహిళ ఉపాధ్యాయులను నియమించాలన్న ఖచ్చితమైన నిబంధన ఉన్న అమలు కావడం లేదు. 
    గిరిజన సంక్షేమ శాఖలో అక్రమ పదోన్నతులు
    మైదాన ప్రాంత ఏటీడబ్ల్యూఓగా పని చేస్తున్న కృష్ణమోహ¯ŒS రాజమహేంద్రవరంలో గిరిజన సంక్షేమ హాస్టల్‌ వార్డె¯ŒSగా కూడా విధులు నిర్వహిస్తున్నారు. అయితే అక్కడ విద్యార్థుల హాజరు కంటే ఎక్కువ సంఖ్యలో హాజరు నమోదు చేసి డైట్‌ బిల్లులు కాజేసినట్లు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై కూడా ఐటీడీఏ అధికారులు దృష్టి సారించి విచారణ చేపట్టారు. హాజరు పట్టిలో నమోదు చేసిన పేర్లను, హాస్టల్‌లో ఉన్న విద్యార్థిను ల సంఖ్యను ఆరా తీస్తున్నారు. కృష్ణమోహ¯ŒS గ్రేడ్‌–1 వార్డె¯ŒSగా అక్రమమార్గంలో పదోన్నతి పొందినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం విద్యార్థినిలను బొమ్మూరు ఆశ్రమ పాఠశాల నుంచి రాజమహేంద్రవరంలోని తన ఇంటికి తీసుకువెళ్లిన సంఘటనపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసేందుకు కూడా అధికారులు ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. ఏజెన్సీ, మైదాన ప్రాంతాలలో గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో మహిళ ఉపాధ్యాయులను, మహిళ పీఈటీ, పీడీలను నియమించాలని ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లండా వేణుగోపాల్‌ డిమాండ్‌ చేశారు. విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని గిరిజన సంక్షేమ డీడీ సుజాత తెలిపారు. డైట్‌ బిల్లులు వ్యవహరంపై విచారణ చేస్తామన్నారు. 
     

Advertisement

తప్పక చదవండి

Advertisement