గల్ఫ్ గాయం.. సాగు భారం | Sakshi
Sakshi News home page

గల్ఫ్ గాయం.. సాగు భారం

Published Fri, Nov 11 2016 4:17 AM

గల్ఫ్ గాయం.. సాగు భారం

ఎల్లారెడ్డిపేట: ఉన్న ఊరిలో ఉపాధి లేక అప్పులు చేసి గల్ఫ్ వెళ్లిన గిరిజన రైతుకు అక్కడ చుక్కెదురైంది. నమ్ముకున్న వ్యవసాయం నట్టేట ముంచింది. అప్పుల భారం అధిక మైంది. దీంతో మనస్తాపం చెందిన రైతు తాను నమ్ముకున్న పొలంలోనే చెట్టుకు ఉరేసుకోవడం అందరినీ కలిచివేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాశిగుట్ట తండాకు చెందిన రైతు మాలోతు గంగారాం(48) వ్యవసా యం కుంటుపడడంతో రూ.2 లక్షలు అప్పులు చేసి గల్ఫ్‌కు వెళ్లాడు.

అక్కడ కంపెనీలో పనులు లేకపోవడంతో వెళ్లిన ఏడాదికి.. అప్పులు తీర్చకుండానే స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. గ్రామంలో మూడె కరాల్లో పత్తి, వరిపంటలు సాగు చేశాడు. ఇటీవల కురి సిన వర్షాలతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దిగుబడి వచ్చే పరిస్థితి కనిపించలేదు. దీనికితోడు కుమార్తెల పెళ్లిళ్లు, కుమారుడి ఆపరేషన్ కోసం మరిన్ని అప్పులు చేశాడు. పంట దిగుబడి రాకపోవడం.. గల్ఫ్ వెళ్లడానికి చేసిన అప్పులు తీరకపోవడం, కుటుంబ పోషణ భారం కావడంతో కుంగి పోయిన గంగారాం పొలంలో చెట్టుకు ఉరివేసుకున్నాడు. 

Advertisement
Advertisement