పుట్టపర్తికి ఘన నివాళి | Sakshi
Sakshi News home page

పుట్టపర్తికి ఘన నివాళి

Published Thu, Sep 1 2016 11:02 PM

పుట్టపర్తికి ఘన నివాళి

ప్రొద్దుటూరు కల్చరల్‌:
పుట్టపర్తి నారాయణాచార్యుల వర్ధంతి సందర్భంగా శివాలయం సెంటర్‌లోని పద్మశ్రీ డాక్టర్‌ పుట్టపర్తి నారాయణాచార్యుల కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మొల్ల సాహితీపీఠం అధ్యక్షుడు గానుగపెంట హనుమంత రావు మాట్లాడుతూ 14 భాషాల్లో పాండిత్యం కలిగిన అసాధరణ మేధావి పుట్టపర్తి అని కొనియాడారు. కడపలో పుట్టపర్తి నారాయణాచార్యుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, ఆయన నివశించిన భవనాన్ని స్మారక భవనంగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో అగస్త్యేశ్వరస్వామి ఆలయం కమిటీ చైర్మన్‌ శంకరనారాయణ, మొల్లా సాహితీ పీఠం ఉపాధ్యక్షులు మునెయ్య, పేరి గురుస్వామి, పుట్టపర్తి సాహితీపీఠం కార్యదర్శి జింకా సుబ్రమణ్యం, రచయితలు, కవులు డాక్టర్‌ గోపాల్‌రెడ్డి, మునిస్వామి, భాస్కర్‌రాజు, అశోక్, తవ్వా సురేష్‌ పాల్గొన్నారు. అలాగే అనిబిసెంటు మున్సిపల్‌ హైస్కూల్‌లోని స్త్రీశక్తి భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటశివారెడ్డి మాట్లాడుతూ పుట్టపర్తి ప్రొద్దుటూరు వాసి కావడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో ఆడిటర్‌ గోపాలరావు, నిర్వహణ కార్యదర్శి రాంప్రసాద్‌రెడ్డి, రామాంజనేయరెడ్డి, ఖాసీం సాహెబ్, ప్రధానోపాధ్యాయుడు కాశీప్రసాదరెడ్డి, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement