డీఎస్‌ఏలో ప్రక్షాళన షురూ | Sakshi
Sakshi News home page

డీఎస్‌ఏలో ప్రక్షాళన షురూ

Published Mon, Jul 18 2016 2:46 PM

trouble shooting in dsda

జిల్లా క్రీడాప్రాధికార సంస్థలో నూతన అధ్యాయానికి శ్రీకారం
పాత భవనంలోకి డీఎస్‌డీఓ ఛాంబర్‌ మార్పు
ప్రస్తుత గదిని కలెక్టర్, శాప్‌ బోర్డు సమావేశాలకు కేటాయింపు
స్టేడియం ఆధునికీకరణ ఇప్పట్లో లేకపోవడమే కారణమా?
 
శ్రీకాకుళం న్యూకాలనీ: డీఎస్‌ఏ డీఎన్‌ఏ మారుతోంది. అదేనండీ జిల్లా క్రీడాప్రాధికార సంస్థలో ప్రక్షాళన మొదలైంది. భవనాల నుంచి సిబ్బంది వరకు మార్పు అనివార్యంగా కనిపిస్తోంది. మళ్లీ పాత రోజుల వైపు ప్రయాణించడాన్ని క్రీడాసంఘాలు, పీఈటీ సంఘ ప్రతిని ధులు, వెటరన్‌ క్రీడాకారులు స్వాగతిస్తున్నారు.
 
చాంబర్‌ మార్పుతో మొదలు..
 
 
ప్రక్షాళన డీఎస్‌డీఓ చాంబర్‌తోనే మొదలైంది. పదేళ్లుగా పసగడ్డ సూర్యనారాయణ ద్వారానికి ఆనుకుని ఉన్న డీఎస్‌డీఏ చాం బర్‌ను డీఎస్‌ఏ ప్రధాన ద్వారం వద్ద గల భవనం గదుల్లోకి మార్చారు. పాత భవనమే అయినా నూతన చాంబర్‌లోకి ముఖ్యమైన ఫైళ్లతో ఉన్న బీరువా, ఫైళ్లు, కంప్యూటర్లు, ప్రింటర్లు తదితర సామగ్రిని మార్చారు. ఇవే భవనాల్లో గతంలో శంకరరావు, సూరారెడ్డి, రామ్మోహనరావు, వేణుగోపాలరావు, పున్నయ్యచౌదరి, ఆంజనేయులు, పూర్ణచంద్రరావు తదితరులు జిల్లా క్రీడాభివృద్ధి అధికారులుగా పనిచేశారు. 2004–05లో డీ ఎస్‌డీఓగా ఎల్‌.దేవానందం బాధ్యతలు తీసుకున్న తర్వాత గేటుకు సమీపంలో అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దారు. అయితే పాత రోజు లతో పోల్చితే భవనం మార్చిన తర్వాత పెద్దగా అభివృద్ధి లేదని విశ్రాంత పీఈటీలు, క్రీడాసంఘాల నుంచి విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. దీంతో పాత భవనంలోకి కార్యాల యాన్ని మార్చారు.
 
మళ్లీ పాతరోజుల్లోకి... 
 
జిల్లా క్రీడాప్రాధికార సంస్థ కార్యాలయంలో మళ్లీ పాతరోజులని గుర్తుచేస్తూ ప్రస్తుత డీఎస్‌డీఓ బి.శ్రీనివాస్‌కుమార్‌ అడుగులు వేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌ కోచ్‌గా, వందలాది మంది క్రీడాకారులను తయారుచేసిన శ్రీనివాస్, గతంలో ఇక్కడ అథ్లెటిక్స్‌ కోచ్‌గా కూడా పనిచేశారు. ఇన్నాళ్లు ఉపయోగించిన తన చాంబర్‌ను జిల్లా కలెక్టర్‌తో సమావేశాలకు, శాప్‌ బోర్డు సమావేశాలకు, వీడియో కాన్ఫరెన్స్‌లకు, క్రీడాసామగ్రికి వినియోగించాలని భావిస్తున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేడియం ఆధునికీకరణ ఇప్పట్లో జరుగుతుందన్న నమ్మకం లేకపోవడంతో ఉన్న సౌకర్యాల ను ఉపయోగించుకోవాలని, క్రీడాకారులకు మరింత చేరువ కావాలని భావిస్తున్నట్లు సమాచారం. 
 
సిబ్బంది లేమితో సతమతం..
 
 
మార్పుల వరకు బాగానే ఉన్నా సిబ్బంది లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ఉన్న కొద్దిమంది సిబ్బందితోనే ఆధునికతను జోడిం చే విధంగా విధులు నిర్వర్తించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. కొంతమంది సిబ్బందిని స్టేడియంలోను మిగిలిన సిబ్బందిని డీఎస్‌ఏ పరిధిలో ఉన్న స్విమ్మింగ్‌ ఫూల్‌లోను పని చేసే విధంగా వారి రోజువారి విధులను సిద్ధం చేస్తున్నారు. ప్రక్షాళన ఓ కొలిక్కి వస్తే అనంతరం ఈ సీజన్‌ క్రీడాపోటీలు, టోర్నీల షెడ్యూల్‌ ప్రణాళిక, వాటి అమలు, అకాడమీలు, మినీ స్టేడియాలపై దృష్టిసారించాలని యోచిస్తున్నట్లు తెలిసింది.  

Advertisement
Advertisement