తెయూ సీవోఈగా కనకయ్య | Sakshi
Sakshi News home page

తెయూ సీవోఈగా కనకయ్య

Published Fri, Sep 16 2016 11:30 PM

TU CEO kanakayya

తెయూ(డిచ్‌పల్లి) : 
తెలంగాణ యూనివర్సిటీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌(సీవోఈ)గా కనకయ్య నియమితులయ్యారు. వైస్‌ చాన్స్‌లర్‌ సాంబయ్య ఆదేశాల మేరకు రిజిస్ట్రార్‌ జయప్రకాశ్‌రావు ఈ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన 2014 నుంచి ప్రస్తుతం ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇన్‌చార్జి కంట్రోలర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పాత నాగరాజు నుంచి ఆయన శుక్రవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన వీసీ సాంబయ్య, రిజిస్ట్రార్‌ జయప్రకాశ్‌రావులకు కృతజ్ఞతలు తెలిపారు. కనకయ్యను అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు.  

Advertisement
Advertisement