లారీ కింద నలిగిన తండ్రీ కొడుకులు | Sakshi
Sakshi News home page

లారీ కింద నలిగిన తండ్రీ కొడుకులు

Published Fri, Sep 30 2016 8:54 PM

లారీ కింద నలిగిన తండ్రీ కొడుకులు - Sakshi

 బైక్‌ మీద నుంచి కిందపడగానే

   దూసుకెళ్లిన లారీ 
– కైకలూరు జాతీయ రహదారిపై దుర్ఘటన 
 
కైకలూరు :
లారీ దూసుకెళ్లి తండ్రీకొడుకులు దుర్మరణం పాలైన ఘటన కైకలూరు జాతీయ రహదారిపై శుక్రవారం చోటు చేసుకుంది. మాదాల అమర్‌బాబు (50), అతని కొడుకు ఉమామహేశ్వరరావు (22) భైరవపట్నంలోని ఇంటికి Ðð ళుతున్నారు. కైకలూరు ఓరియంట్‌ స్కూల్‌ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి కిందపడ్డారు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ వీరిద్దపై నుంచి దూసుకెళ్లింది. ఇద్దరి తలలు ఛిద్రదమయ్యాయి. కుమారుడు అక్కడికక్కడే మృతి చెందగా, తండ్రిని 108 వాహనంలో కైకలూరు ప్రభుత్వాసుపత్రికి, అటు నుంచి ఏలూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. విషయం తెలుసుకున్న అమర్‌బాబు భార్య నాగరత్నం ఆస్పత్రికి వచ్చారు. ఆమె మానసిక స్థితి సరిగా లేదని గ్రామస్తులు చెప్పారు. చివరకు ఆమె ఫిర్యాదు మేరకు టౌన్‌ ఎసై షబ్బిర్‌ అహ్మద్‌ కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు. తండ్రీకొడుకుల మరణంతో భైరవపట్నంలో విషాదచాయలు అలుముకున్నాయి. అమర్‌బాబుకు ఇరువురు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తెకు పెళ్లిచేశాడు,అమర్‌ ఆటోడ్రైవర్‌గా, కుమారుడు వడ్రంగిగా జీవితాన్ని లాక్కొస్తున్నారు. భార్యతో విభేదాల వల్ల పిల్లలతో విడిగా కలిసి ఉంటున్నాడు.  
 
ఇరుకు రోడ్డుతో ప్రమాదాలు 
 
కైకలూరు సంతమార్కెట్‌ నుంచి పెద్ద మసీదు వరకు రోడ్డు ఇరుకుగా ఉంటుంది. దీనికి తోడు సమీప దుకాణాల ముందు విచ్చలవిడిగా వాహనాలను నిలుపుతున్నారు. ఈ కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. గుడివాడ, ఏలూరు నుంచి ద్విచక్రవాహనాలను బైపాస్‌ మీదుగా పంపిస్తే ప్రమాదాల సంఖ్య తగ్గుతుందని స్థానికులు చెబుతున్నారు. ఏలూరు నుంచి వచ్చే వాహనాలను ఫైర్‌ స్టేషన్‌ మీదుగా మళ్ళించాలని కోరుతున్నారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌ను అరెస్టు చేసినట్లు తెలిసింది. 
 
 

Advertisement
Advertisement