ఉల్లిపాలెం వారధి పనుల పరిశీలన | Sakshi
Sakshi News home page

ఉల్లిపాలెం వారధి పనుల పరిశీలన

Published Fri, Aug 5 2016 7:59 PM

ఉల్లిపాలెం వారధి పనుల పరిశీలన

కోడూరు :
దివిసీమ ప్రజలు జిల్లా కేంద్రమైన మచిలీపట్నం వెళ్లేందుకు కృష్ణానదిపై నిర్మిస్తున్న ‘ఉల్లిపాలెం–భవానీపురం’ వారధి తీరప్రాంతాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని న్యూఢిల్లీ నుంచి వచ్చిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అన్నారు. జాతీయ విపత్తుల నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఈ వారధి నిర్మించేందుకు ప్రపంచ బ్యాంకు రూ.77.5కోట్లు నిధులు కేటాయించింది. దీంతో ఇక్కడ నిర్మాణ తీరును పరిశీలించేందుకు శుక్రవారం బ్యాంకు సెక్టార్‌ కో–ఆర్డినేటర్‌ చిరంజీవిరెడ్డి, ఆర్‌అండ్‌బీ అధికారులతో కలిసి బ్రిడ్జి ఇంజనీర్‌ అకోల్‌ బుమిక్‌ ఉల్లిపాలెం వచ్చారు. ఉల్లిపాలెం, భవానీపురం వైపు జరుగుతున్న నిర్మాణ పనులను నిశితంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఉల్లిపాలెం వైపు పూర్తిస్థాయిలో ఫైలింగ్, ఫైల్‌క్యాపుల నిర్మాణాలు పూర్తిచేసి, గడ్డర్ల నిర్మాణ ప్రక్రియను వేగవంతంగా చేస్తున్నట్లు నవయుగ కంపెనీ ఇంజనీర్లు వివరించారు. గడ్డర్లు నిర్మాణం కూడా త్వరగా పూర్తిచేసి, లాంచర్‌ ద్వారా ఫైల్‌క్యాపులపై ఉంచేందుకు ప్రణాళిక సిద్ధం చేసామని, అనుకున్న సమయానికి వారధిని పూర్తి చేయనున్నట్లు ప్రాజెక్టు మేనేజర్‌ ఖన్నన్‌ తెలిపారు.  క్వాలిటీ ఇంజనీర్‌ పి.సీతారామరాజు, ఆర్‌అండ్‌బీ ఈఈ మురళీకృష్ణ, డీఈ వెంకటేశ్వరరెడ్డి, ఏఈ కామేశ్వరరావు పాల్గొన్నారు.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement