అండర్‌–19 బాస్కెట్‌బాల్‌ రాష్ట్ర జట్ల ఎంపిక

31 Dec, 2016 22:36 IST|Sakshi
రామచంద్రపురం :
స్కూల్‌గేమ్స్‌ ఫెడరేష¯Œ¯ŒS అండర్‌ –19 బాలుర, బాలికల బాస్కెట్‌బాల్‌ రాష్ట్ర జట్లను పోటీల అబ్జర్వర్, పీడీ సీతాపతి, జిల్లా కార్యదర్శి వై.తాతబ్బాయి శనివారం ప్రకటించారు. స్థానిక కృత్తివెంటి పేర్రాజు పంతులు క్రీడాప్రాంగణంలో మూడురోజులు నిర్వహించిన అంతర్‌ జిల్లాల బాస్కెట్‌బాల్‌ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబర్చినవారిని రాష్ట్ర జట్లకు ఎంపిక చేశామని, ఈ నెల 9 నుంచి నూజివీడులో జరిగే జాతీయస్థాయి పోటీల్లో ఈ జట్లు ఆడతాయన్నారు. రాష్ట్ర బాస్కెట్‌బాల్‌ అసోసియేష¯ŒS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నమని చక్రవర్తి, పీడీలు జంపన రఘురాం, గెడా శ్రీనివాసు తదితరులు ఎంపికల్లో పాల్గొన్నారు. 
బాలుర జట్టు
నాగదుర్గాప్రసాద్, సాయిపవ¯ŒSకుమార్, మణికంఠ, అశోక్‌సాయికుమార్, రామరాజు (తూర్పుగోదావరి), కె.రోహిత్‌సాయి,  సురేష్, భాస్కర అవినాష్‌ (గుంటూరు), ఎస్‌కే అబ్దుల్‌నాగూర్, రామ్‌గోపాల్‌( కృష్ణా), ఇమ్రాన్, హర్షంత్‌కుమార్,(చిత్తూరు), డీఎస్‌ నిషాంక్‌ గుప్తా (అనంతపురం), ఆదిత్యరెడ్డి(పశ్చిమగోదావరి), రేవంత్‌కుమార్‌(విశాఖ), కె.సాయికుమార్, ఉల్లాస్‌ (కడప),  నాగవంశీ(కర్నూల్‌).
బాలికల జట్టు
పద్మావతి, సుకన్య, ప్రమీల, యమున (అనంతపురం), కె.దీప్తిప్రియ, ఎస్‌.కె.జహరాసుహానా, దుర్గ, శ్వేత (తూర్పు గోదావరి), ఎస్‌కే సుష్మాభాను  అఖిల్‌( చిత్తూరు), పూర్ణ, మాధురి (పశ్చిమగోదావరి), హిమబిందు, ప్రియాంక (కృష్ణా), నందిత, నిరోషా(విశాఖ), ఐ.డి.భారతి(కర్నూల్‌), మహేశ్వరి(నెల్లూరు).
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు