ప్రభుత్వ ప్రయోజనాలు వినియోగించుకోవాలి | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ప్రయోజనాలు వినియోగించుకోవాలి

Published Wed, Sep 21 2016 12:02 AM

మాట్లాడుతున్న సామినేని హరిప్రసాద్‌

  • జిల్లా విజయ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం అధ్యక్షుడు హరిప్రసాద్‌
  • ఖమ్మం వ్యవసాయం : ప్రైవేటు డెయిరీల ప్రలోభాలకు గురిగాకుండా ప్రభుత్వ విజయ డెయిరీకి పాలు పోస్తూ ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను పొందాలని జిల్లా విజయ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం అధ్యక్షుడు సామినేని హరిప్రసాద్‌ అన్నారు. మంగళవారం ఖమ్మం రోటరీనగర్‌లోని జిల్లా పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ ఆవరణలో జిల్లాస్థాయి పాల ఉత్పత్తిదారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హరిప్రసాద్‌ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రాంత ప్రైవేటు డెయిరీలు రాష్ట్రంలోని పలు గ్రామాల్లో రైతుల వద్ద నుంచి పాలను సేకరిస్తూ తిరిగి ఆ పాలను ఈ ప్రాంత వాసులకు విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నారన్నారు. కానీ విజయ డెయిరీ లాభాలల్లో 75 శాతం పాడి రైతులకే ఖర్చు చేస్తుందన్నారు. ప్రభుత్వం ప్రతి లీటరుకు ప్రోత్సాహకంగా రూ.4 చెల్లిస్తోందని తెలిపారు. ప్రభుత్వం పాల రైతులకు అనేక సబ్సిడీలను కూడా ఇస్తోందని, పాడి గేదెల కోసం వివిధ బ్యాంకుల నుంచి రుణ సదుపాయం కూడా కల్పిస్తున్నారని వివరించారు. అనంతరం డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ మురళీధర్‌రావు, పశు సంవర్ధకశాఖ శాఖ జేడీ రఘోత్తమరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య ఉపసంచాలకుడు కె.కామేష్‌, జిల్లా సహకార బ్యాంక్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి వి.నాగచెన్నారావు, డీఎల్‌డీఏ చైర్మెన్‌ కొర్లకుంట నాగేశ్వరరావు, నాగేంద్ర, బోజెడ్ల వెంకటయ్య పాల్గొన్నారు.

    20సీకెఎం269 :

Advertisement
Advertisement