కొండలనే మింగుతున్న చిలువలు | Sakshi
Sakshi News home page

కొండలనే మింగుతున్న చిలువలు

Published Mon, Dec 5 2016 11:04 PM

కొండలనే మింగుతున్న చిలువలు

వజ్రకూటం ఆర్‌ఎఫ్‌లో జోరుగా మట్టి తవ్వకాలు
ఫారెస్టు అధికారుల అండదండ
రెండేళ్లుగా నిర్విరామంగా సాగుతున్న వైనం
దాడులతో బయటపడ్డ భాగోతం
 
అక్రమార్కులు కొండలను పిండేస్తున్నారు. కత్తిపూడికి సమీపంలోని వజ్రకూటం రిజర్వుఫారెస్టు కొండపైకి అక్రమార్కులు జొరబడి యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. వీరికి అధికార పార్టీ నేతల అండదండ సరేసరి. దీనికితోడు అటవీశాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరి మరో కారణం. వెరసి వజ్రకూటం ఆర్‌ఎఫ్‌ బీ624లో ఇప్పటికే కోట్ల రూపాయల విలువచేసే మట్టి బయటి ప్రాంతాలకు తరలించుకుపోయారు. - శంఖవరం
 
శంఖవరం మండలం కత్తిపూడికి సమీపంలోని వజ్రకూటం ప్రాంతంలోని కొండను ఆనుకుని ఖాళీ భూముల్లో కొందరు నిరుపేద రైతులకు డి పట్టా భూములున్నట్లు అక్రమార్కులు గుర్తించారు. మీ భూమిని చదును చేసి అప్పగిస్తామని, మట్టిని తాము తీసుకుంటామని, ఇందుకు ఎకరాకు రూ.లక్ష ఇస్తామని రైతులతో ఒప్పందాలు కుదుర్చుకుని తవ్వకాలు ప్రారంభించినట్లు తెలిసింది. భూమి చదును కావడమే గాక వారిచ్చే రూ.లక్షకు చాలామంది ఆశపడారు. దీనితో ఏళ్ల తరబడి పెంచుకుంటున్న జీడి మామిడి చెట్లను సైతం నరికి మట్టి తవ్వకాలకు అక్రమార్కులతో ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు చెబుతున్నారు. దాదాపు 10 ఎకరాల్లో ఈ తవ్వకాలు జరిగినట్లు తెలుస్తోంది. మొదట డీ పట్టా భూముల్లో తవ్వకానికి దిగిన అక్రమార్కులు క్రమేపీ రిజర్వుఫారెస్టు పరిధిలోకి చొరబడారు. ఈ అక్రమార్కులకు అధికార పార్టీ నేతలు అండదండ ఉండడంతో మట్టి వ్యాపారం మూడు పువ్వూలు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. 
పల్లపు భూముల్ని మెరక చేసేందుకే...
కాకినాడ, రాజమండ్రి, తుని వైపు జాతీయరహదారిని ఆనుకుని ఉన్న భూముల్ని మెరక చేసేందుకు భారీఎత్తున మట్టి తరలిస్తున్నారు. రెండేళ్లుగా సాగుతున్న ఈ తంతులో ఇప్పటికే కోట్లాది రూపాయల మట్టిని తరలించుకుపోయినా సంబంధిత అటవీశాఖ అధికారులు ఎన్నడూ స్పందించిన దాఖలాలు లేవు. అటవీశాఖ కత్తిపూడి కేంద్రం చేసుకుని మూడు దశాబ్ధాలకు పైగా ఫారెస్టు ఠాణా నడుపుతోంది. ఈ ఠాణా మీదుగా మట్టి లారీలు రాకపోకలు సాగిస్తున్నా రిజర్వుఫారెస్టు అంతమవుతోందని గుర్తించకపోవడం శోచనీయమం. శంఖవరం సెక్షన్‌ పరిధిలో ఉన్న ఈ కొండపై పలుచోట్ల మట్టి తవ్వకాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సెక్షన్‌ కార్యాలయం కూడా కత్తిపూడిలోనే ఉంది. సంబంధిత అధికారుల అండదండలు అక్రమార్కులకు లభిస్తున్నట్లు చెబుతున్నారు. అక్రమార్కుల ధనార్జనకు ఈ ప్రాంతంలో బొరియపడని కొండలు లేవంటే అతిశయోక్తి కాదు. అంతేగాక లారీల రాకపోకలు అధికమై రోడ్లు ఛిద్రం కావడం, వాతావరణ, వాహన, శబ్ధ కాలుష్యాలు పెరిగి పరిసర గ్రామాల ప్రజలు తల్లడిల్లుతున్నారు. తక్షణం దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 
ఏలేశ్వరం ఫారెస్టు రేంజ్‌ అధికారి దాడి
ఇదిలా ఉండగా బుధవారం తెల్లవారుజామున ఏలేశ్వరం ఫారెస్టు రేంజ్‌ అధికారి జె.శ్రీనివాస్‌ ఆధ్వర్యంలోని అటవీ బృందం ఆకస్మికంగా దాడిచేసి మట్టిని తరలింపుకు సిద్ధమైన రెండు లారీలను, ఒక పొక్లయి¬న్‌ను, ఒక మోటారు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేంజ్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌ కొండను ఆనుకుని తవ్విన ప్రదేశాల్ని గుర్తించారు. అం¬తే ఈ ప్రాంతం అటవీశాఖ పరిధిలోనిదా?కాదా? అనే దానిపై నిర్థారణ చేసి తవ్వకానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని వివరించారు. రేంజ్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌ సందిగ్ధంగా చెప్పడం వెనుక మతలబు ఉందనే వ్యాఖ్యానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి¬. ఈ దాడుల్లో శంఖవరం సెక్షన్‌ ఆఫీసర్‌ విజయరత్నం కూడా ఉన్నారు. గతంలో ఆయనే కత్తిపూడిలో మకాం ఏర్పాటు చేసుకుని ఉండటం గమనార్హం.

Advertisement

తప్పక చదవండి

Advertisement