నగరంలో నోరూరిస్తున్న నల్ల కోడి | Sakshi
Sakshi News home page

నగరంలో నోరూరిస్తున్న నల్ల కోడి

Published Sat, Aug 20 2016 8:00 PM

నగరంలో నోరూరిస్తున్న నల్ల కోడి

సాక్షి,వీకెండ్:  ఫారం కోళ్లను తినీ తినీ ఉన్నాం. కాబట్టి నాటు కోడి... అంటే అబ్బ ఆ రుచే వేరు అంటూ లొట్టలేస్తాం. బ్రాయిలర్‌నూ, నాటుకోడినీ తలదన్నేలా.. నగరంలోకి వచ్చేసింది నల్ల కోడి. తల నుంచి పాదాల వరకు ప్యూర్‌ బ్లాక్‌ కలర్‌లో మిలమిల మెరిసే ఈ బ్లాక్‌ బ్యూటీ అంటే నాన్‌వెజ్‌ ప్రియులు వావ్‌ అంటున్నారు. రుచిలో మాత్రమే కాదు ఈ నల్లని కోడి మాంసం ఖరీదులోనూ ఇప్పుడు అధరహో అంటోంది. బ్రాయిలర్‌ కోడి రేటు కన్నా ఏడింతల ధర పలికే ఈ నల్ల కోడి మాంసం పులుసు, వేపుడు రుచులను జూబ్లీహిల్స్‌లోని ఉలవచారు రెస్టారెంట్‌ తమ మెనూలో తొలిసారి పరిచయం చేస్తోంది.

సేంద్రీయ పద్ధతిలో పెంపకం...
మాంసం, ఎముకలు, ఈకలు.. అంతా నల్లగా ఉండే ఈ కోడి కేరాఫ్‌ ఇండోనేషియా. ఈ కోడిని మిగతా కోళ్లలా కాకుండా అచ్చమైన సేంద్రీయ పద్ధతులలో పెంచుతారు. ఈ నల్లకోళ్ల వ్యాపారానికి మంచి భవిష్యత్తు ఉంటుందనే గ్యారంటీతో మన దగ్గరా నల్లకోళ్ల పెంపకాన్ని చేపడుతున్నారు. ‘ఈ నల్లకోడి మాంసానికి మనదైన తెలుగు సై్టల్‌ రుచిని జత చేసి నల్లకోడి పులుసు, నల్లకోడి వేపుడు... వంటి వెరైటీలను అందిస్తున్నాం’ అని చెప్పారు ఉలవచారు రెస్టారెంట్‌ యజమాని నరహరి వినయ్‌ రెడ్డి, మేనేజింగ్‌ పార్టనర్‌ విజయరెడ్డిలు.

ఈ కోడి తొమ్మిది నెలల్లో కేజిన్నర బరువు పెరిగితే అంతే టైమ్‌లో బ్రాయిలర్‌ కోడి రెండున్నర కేజీల బరువు తూగుతుంది. అంటే, రెగ్యులర్‌గా లభించే బ్రాయిలర్‌ చికెన్‌తో పోల్చితే నల్లకోడి మాంసంలో ఏ మాత్రం కొలెస్ట్రాల్‌ ఉండదని, రుచి అమోఘమని దీని వల్ల తెలుస్తుందని చెబుతున్నారు విక్రేతలు. ప్రస్తుతానికి సిటీ మార్కెట్‌లో కేజీ నల్ల కోడి మాంసం రూ.800కు పైగా పలుకుతోంది.
– సాక్షి వీకెండ్‌ ప్రతినిధి

Advertisement

తప్పక చదవండి

Advertisement