ఏపీపీఎస్సీ నుంచి మినహాయించాలి | Sakshi
Sakshi News home page

ఏపీపీఎస్సీ నుంచి మినహాయించాలి

Published Sat, Aug 27 2016 12:19 AM

ఏపీపీఎస్సీ నుంచి మినహాయించాలి

 
గన్నవరం :
ఏపీపీఎస్సీ నుంచి పశువైద్యుల నియామకాలను మినహాయించాలని కోరుతూ స్థానిక ఎన్టీఆర్‌ వెటర్నరీ కళాశాల చేపట్టిన ఆందోళనను ఉధృతం చేశారు. ఆందోళన శుక్రవారానికి 16వ రోజుకు చేరింది. సమ్మెలో స్థానిక కళాశాల విద్యార్థులతో పాటు తిరుపతి, ప్రొద్దుటూరు నుంచి వచ్చిన 60 మంది పశువైద్య విద్యార్థులు పాల్గొన్నారు. కళాశాల ప్రధాన ద్వారానికి తాళాలు వేసి బైఠాయించి, ప్రభుత్వ విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విద్యార్థి నాయకులు ఎం.భాస్కర్, డి.ఏడుకొండలు, రామ్మోహన్, ఎం.ప్రవీణ్‌రాజు మాట్లాడుతూ.. 30 ఏళ్లుగా డిపార్ట్‌మెంట్‌ సెలక్షన్ల ద్వారా జరుగుతున్న పశువైద్యుల నియామకాలను ప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలనుకోవడం దారుణమన్నారు. దీనివల్ల డబ్బు, రాజకీయ పలుకుబడి ఉన్నవారికే ఉద్యోగాలు వస్తాయని, ప్రతిభవంతులైన విద్యార్థులకు ∙అన్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రెండు వారాలకుపైగా తరగతులు, బోర్డు పరీక్షలను బహిష్కరించి ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధకరమన్నారు. ఇప్పటికైనా పాలకులు, ఉన్నతాధికారులు స్పందించి పాతపద్ధతిలోనే కొత్తగా మంజూరైన 300 వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఆందోళనను తీవ్రం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులు కె.రమ్య, స్వాతి పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement