విలీన ప్రజల అరణ్య రోదన | Sakshi
Sakshi News home page

విలీన ప్రజల అరణ్య రోదన

Published Sat, Jul 15 2017 12:07 AM

విలీన ప్రజల అరణ్య రోదన - Sakshi

రాష్ట్రం మారినా తీరని కష్టాలు
రేషన్, ఆరోగ్యశ్రీ కార్డుల్లో ఖమ్మం జిల్లా పేరు
మూడేళ్ళుగా పట్టించుకోని పాలకులు
ఏజెన్సీ మండలాల ప్రజల అవస్థలు 
 
వేలేరుపాడు: 
పోలవరం ముంపు ప్రాంతాలైన వేలేరుపాడు, కుక్కునూరు మండలాలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విలీనమై మూడేళ్ళు అవుతున్నా ఇంకా ఈ మండలాల రేషన్, ఆరోగ్యశ్రీ కార్డులు ఖమ్మం జిల్లా పేరుతోనే ఉన్నాయి. ఈ రెండు మండలాల్లో ఉమ్మడి రాçష్ట్రంగా ఉన్నప్పుడు 16,191 డబ్ల్యుఏపీ రేషన్‌ కార్డులుండగా, ఆంధ్రప్రదేశ్‌ రాçష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లాలో విలీనమయ్యాక వాటి సంఖ్య 18,893కు పెరిగింది. జిల్లాలో విలీనమయ్యాక 2,283 కుటుంబాలు పెరిగాయి. వేలేరుపాడు మండలంలో మూడేళ్ళ క్రితం 6041 కార్డులుండగా, ప్రస్తుతం 7,393, కుక్కునూరు మండలంలో 10150 ఉండగా, 11,500కు పెరిగాయి. ఇవికాకుండా ఈ రెండు మండలాల్లో 745 జెఏపీ కార్డులు జన్మభూమి కార్యక్రమంలో జారీ చేశారు. ఈ కార్డులు మాత్రం పశ్చిమ గోదావరి జిల్లా చిరునామాతో ఉన్నాయి.  18893 డబ్ల్యుఏపీ రేషన్‌ కార్డులన్నీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటో ప్రచురించినప్పటికీ, చిరునామాలో మాత్రం నేటికీ తెలంగాణా రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా పేరుతోనే జారీ చేశారు. గతంలో ఉన్న రాజీవ్‌ ఆరోగ్యశ్రీ కార్డుల స్ధానంలో ఎన్‌టీఆర్‌ వైద్య సేవ హెల్త్‌ కార్డ్‌లను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఈ కార్డులు కూడా ఖమ్మం జిల్లా పేరుతో ఉన్నాయి. ఫలితంగా ఈ రెండు మండలాల ప్రజలు అన్ని విధాలుగా నానా అవస్ధలు పడుతున్నారు. ముఖ్యంగా  వైద్య సేవలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. కార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమని ప్రచురించినప్పటికీ  ఖమ్మం జిల్లా పేరు ఉండటం వల్ల  ఉచిత వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు నిరాకరిస్తున్నాయి. ఈ రెండు మండలాల ప్రజలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా వాసులైనప్పటికీ ఖమ్మం జిల్లా పేరు రేషన్‌ కార్డుల్లో ఉండటం వల్ల ఇక్కడ కూడా ఎన్‌టీఆర్‌ వైద్య సేవ హెల్త్‌ కార్డ్‌లున్నా ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లా మారకపోవడం వల్ల విద్య పరంగా  కూడా ఉన్నత చదువులకు బయటికెళ్లే విద్యార్థులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి తమ చిరునామాలు పశ్చిమగోదావరి జిల్లాకు మార్చాలని ఈ మండలాల ప్రజలు కోరుతున్నారు. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Advertisement
Advertisement