మా ఊరి ఆట.. | Sakshi
Sakshi News home page

మా ఊరి ఆట..

Published Sun, May 7 2017 11:05 PM

మా ఊరి ఆట..

ఆచ్ఛన్న కాయలతో హుషారు
హలో ఫ్రెండ్స్‌... రండీ మీరు కూడా మాతో పాటు కలిసి అచ్చనకాయల ఆట ఆడేయండీ..  ముందుగా ఆటలో నలుగురికి తక్కువ కాకుండా చూసుకోవాలి. ఓ మోస్తారు సైజ్‌లో ఉన్న ఐదు రాళ్లను తీసుకోండి. అప్పచ్చులు వేసుకున్న తర్వాత ఫస్ట్‌ ఆడేవారిని గుర్తించాలి. ఆటలో ముందుగా ఐదు రాళ్లు చేతిలో పట్టుకుని పైకి ఒకరాయి ఎగురవేస్తూ మిగిలిన రాళ్లను కుప్పగా కింద పెట్టాలి. పైకి ఎగిరేసిన రాయి కింద పడకుండా క్యాచ్‌ పట్టుకోవాలి. తిరిగి మరోసారి ఆ రాయిని గాలిలోకి ఎగిరేసి, కింద పెట్టిన మొత్తం రాళ్లను ఒకేసారి ఎతే​‍్తసుకుంటూ గాలిలో రాయిని క్యాచ్‌ పట్టుకోవాలి.

ఇది మొదటి స్టెప్‌ అన్న మాట, ఇది గెలిచిన తర్వాత రెండో స్టెప్‌లో రాళ్లను కింద వేసి, సెకండ్‌ ఆడేవారు చెప్పిన రాయిని వదిలేసి, మిగిలిన రాళ్లలో నుంచి ఒకదానిని తీసుకోవాలి. ఇలా తీసుకునేటప్పుడు దాని పక్కన ఉన్న రాళ్లు కదలకూడదు. ఒకవేళ కదిలితే ఔటైపోయినట్లు. అలా తీసుకున్న రాయిని కుడిచేతిలో పెట్టుకుని పైకి ఎగురవేసి కింద పడకుండా గాలిలోనే క్యాచ్‌ పడుతూ ఉండాలి. అదే సమయంలో ఎడమ చేతి చూపుడు వేలు, బొటనవేలును భూమికి ఆనించి గుడారం మాదిరిగా చేసుకుని మిగిలిన రాళ్లను ఒకదాని తర్వాత ఒకటి లోపలకు పంపాలి. ఇలా పంపేటప్పుడు మిగిలిన రాళ్లు కదలకుండా చూసుకోవాలి. తర్వాత అన్ని రాళ్లను ఒకేసారి చేతిలో తీసుకోవాలి. ఇలా నాలుగైదు రకాలుగా ఈ ఆట ఆడవచ్చు.
- చెన్నేకొత్తపల్లి (రాప్తాడు)

Advertisement
Advertisement