అమరావతికి వైజాగ్ మేస్త్రీలు! | Sakshi
Sakshi News home page

అమరావతికి వైజాగ్ మేస్త్రీలు!

Published Sun, Jun 5 2016 7:56 PM

అమరావతికి వైజాగ్ మేస్త్రీలు! - Sakshi

సాక్షి, విశాఖపట్నం: అమరావతిలో తాత్కాలిక రాజధాని అమరావతి నిర్మాణానికి విశాఖపట్నం నుంచి తాపీ మేస్త్రీలను తరలిస్తున్నారు. తాత్కాలిక రాజధాని నిర్మాణపనులు నత్తనడకన సాగుతుండటంతో రాష్ట్రానికి చెందిన తాపీ మేస్త్రీలను రప్పించాలని మంత్రి నారాయణ ఆదేశించారు. దీంతో తక్షణమే పెద్ద సంఖ్యలో మేస్త్రీలను పంపాలని విశాఖ జీవీఎంసీ అధికారులు, కాంట్రాక్టర్లకు ఉన్నతాధికారులు హుకుం జారీ చేశారు. ప్రస్తుతం నగరంలో పని చేస్తే మేస్త్రీకి రూ.500 నుంచి రూ. 600 వరకు ఇస్తున్నారు.

అయితే, అమరావతిలో పనిచేస్తే ఒక్కొక్కరికి రోజుకు రూ.వెయ్యి ఇస్తామని, ఉచిత భోజనం, వసతి కూడా సమకూరుస్తామని ప్రకటించారు. రాజధాని నిర్మాణం పూర్తయ్యే దాకా పూర్తి స్థాయిలో పని కల్పిస్తామని హామీ ఇచ్చారు. మేస్త్రీలను సమకూర్చిన కాంట్రాక్టర్లకు భవిష్యత్తులో నామినేటెడ్ పనులు ఇస్తామని కూడా ఎర చూపినట్టు తెలిసింది. దీంతో అధికారులు, కాంట్రాక్టర్లు వెంటనే రంగంలోకి దిగారు.

తాపీ మేస్త్రీల కోసం నగరంలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. 90 మందిని రప్పించారు. వీరిలో చిన్నా చితకా మేస్త్రీలతో పాటు వారి సహాయకులు కూడా ఉన్నారు. జీవీఎంసీ ఇంజినీరింగ్ అధికారులు వీరిని శనివారం  రెండు హైటెక్ లగ్జరీ బస్సుల్లో అమరావతికి తరలించారు. వీరి వెంట జీవీఎంసీ సిబ్బంది కూడా వెళ్లారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement