Sakshi News home page

కదులుతున్న వక్ఫ్‌భూముల డొంక

Published Thu, Nov 3 2016 9:29 PM

wakf lands issue

  • సరిహద్దుల నిర్ధారణలో సర్వే బృందాలు
  • వివరాల కోసం మున్సిపాలిటీ,
  • రిజిస్ట్రార్‌లకు వక్ఫ్‌బోర్డు లేఖలు
  • ఆ భూముల నివాసితుల్లో ప్రకంపనలు
  • అమలాపురం టౌ¯ŒS :
    అమలాపురం పట్టణం, రూరల్‌ మండలంలోని వక్ఫ్‌ భూముల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. వక్ఫ్‌ బోర్డు అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తుండటంతో ఆ భూముల డొంక కదులుతోంది. పట్టణంలోని వడ్డిగూడెంలో సర్వే నంబరు 455 లోని 27.95 ఎకరాలను, మండలంలోని భట్నవల్లి, సమనస, తాండవపల్లి, నడిపూడి, నల్లమిల్లి గ్రామాల్లోని దాదాపు 275 ఎకరాల భూములను వక్ఫ్‌ బోర్డు కాకినాడ ఇ¯ŒSస్పెక్టర్‌ సులేమా¯ŒS బాషా రెండురోజుల క్రితం పరిశీలించారు. అంతేగాకుండా అమలాపురం ఆర్డీవో జి.గణేష్‌కుమార్, తహసీల్దార్‌ నక్కా చిట్టిబాబు, అమలాపురం మున్సిపల్‌ కమిషనర్‌ సీహెచ్‌ శ్రీనివాస్, రిజిస్ట్రార్‌ ఇ.లక్షి్మలతో ఇప్పటికే సులేమా¯ŒS విడివిడిగా చర్చించారు. ఈ పరిణామాలతో అమలాపురం వడ్డిగూడెంలోని వక్ఫ్‌ బోర్డు భూములుగా భావిస్తున్న 27.95 ఎకరాల్లో ఇప్పటికే భవంతులు, అపార్ట్‌మెంట్లు, షాపింగ్‌ కాంప్లెక్సులు, ఆస్పత్రులు నిర్మించుకున్న వారు ఉత్కంఠలో ఉన్నారు. ఈ 27.95 ఎకరాల విలువ ప్రస్తుతం దాదాపు రూ.500 కోట్లు చేస్తుందని అంచనా. అంతటి విలువైన ప్రాంతంలో రూ.లక్షలు పెట్టి స్థలాలు కొని, ఇళ్లు, భవనాలు నిర్మించుకున్న వారు ఈ భూములను వక్ఫ్‌బోర్డు స్వా ధీనం చేసుకుంటే తమ పరిస్థితి ఏమిటని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొందరైతే న్యాయపరమైన సలహాలు కూడా తీసుకుంటున్నట్టు తెలిసింది. ఇప్పటికే రూరల్‌ మండలంలో గుర్తించిన 275 ఎకరాల్లోని యాజమానులకు వక్ఫ్‌ బోర్డు నోటీసులు కూడా జారీ చేసింది. ఆ భూములు వక్ఫ్‌ బోర్డువని...వాటిని ఆక్రమించుకోవటం చట్టరీత్యా నేరమని...తమకు స్వాధీనం చేయాలని ఈ నోటీసులో పేర్కొంది.
     
    రెండు రోజుల్లో సర్వేకు సన్నాహాలు
    అమలాపురంలో వక్ఫ్‌ బోర్డు ఆస్తులుగా మొత్తం 91.8 ఎకరాలను గుర్తించారు. అందులో తొలుత వడ్డిగూడెంలో వెలుగు చూసిన 27.95 ఎకరాలపై వక్ఫ్‌బోర్డు అధికారులు దృష్టి పెట్టారు. పట్టణంలోని నల్ల వంతెన, కచేరీ చావిడి ప్రాంతాల్లో మిగిలిన వక్ఫ్‌ భూములను గుర్తించినట్టు తెలిసింది. వడ్డిగూడెంలోని భూముల్లో రెండు రోజుల్లో సర్వే నిర్వహించేందకు వక్ఫ్‌బోర్డు బృందాలను సిద్ధం చేస్తోంది. ఈ సర్వే బృందాల్లో వక్ఫ్‌ బోర్డు, రెవెన్యూ, మున్సిపల్‌ సర్వేయర్లతో పాటు మరికొందరు ఉద్యోగులు ఉంటారు. ఈ బృందాలు ఆ 27.95 ఎకరాల్లో సరిహద్దులను నిర్ధారించనున్నాయి. 
    రిజిస్ట్రార్, మున్సిపల్‌ కార్యాలయాలకు లేఖలు
    వక్ఫ్‌ భూముల వివాదం వెలుగు చూసిన వెంటనే స్థానిక రిజిస్ట్రేష¯ŒS కార్యాలయంలో ఆ భూముల క్రయ, విక్రయలను, రిజిస్ట్రేషన్లను అమలాపురం ఆర్డీవో గణేష్‌కుమార్‌ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వక్ఫ్‌బోర్డు అటు మున్సిపాలిటీకి.. ఇటు రిజిస్ట్రేష¯ŒS కార్యాలయానికి లేఖలు రాసింది. మున్సిపాలిటీ పరిధిలోని ఫలానా సర్వే నంబర్లలోని భూముల్లో ప్రస్తుతం ఎలాంటి కట్టడాలు ఉన్నాయి? ఖాళీ స్థలాలు ఎన్ని ఉన్నాయి? భవనాలకు వాటి హక్కుదారులు చెల్లిస్తున్న పన్నుల వివరాలను తెలియజేయాలంటూ మున్సిపాలిటీని వక్ఫ్‌బోర్డు కోరింది. అలాగే ఫలానా సర్వే నంబరులో ఉన్న భూములకు ఇప్పటి వరకూ జరిగిన రిజిస్ట్రేషన్ల వివరాలను తెలియజేయాలని కూడా కోరింది. పట్టణం, రూరల్‌ మండలాల్లో గుర్తించిన దాదాపు 366 ఎకరాల వక్ఫ్‌ భూముల విలువ దాదాపు రూ. వెయ్యి కోట్ల వరకూ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.  
     

Advertisement

తప్పక చదవండి

Advertisement