1.5లక్షల ఎకరాలకు సాగునీరు | Sakshi
Sakshi News home page

1.5లక్షల ఎకరాలకు సాగునీరు

Published Wed, Sep 7 2016 12:47 AM

water for 1.5lakhs acres

పెద్దకొత్తపల్లి : జొన్నలబొగుడ రెండో, గుడిపల్లి మూడో రిజర్వాయర్‌ నుంచి నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గాలలోని 1.5లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. సోమవారం జొన్నలబొగుడ రిజర్వాయర్‌ వద్ద మొదటి మోటారు పనితీరును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వారంరోజుల్లోనే మొదటి మోటారు ద్వారా 0.7టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి చేరిందన్నారు. జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేసి నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. 
 
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు అడ్డు తగులుతున్న ప్రతిపక్ష నాయకులకు ప్రజలు, రైతులే సరైన బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ వెంకటస్వామి, ఎంపీటీసీ సభ్యుడు నారాయణరావు, పెద్దకొత్తపల్లి, కోడేరు ఎంపీపీలు వెంకటేశ్వర్‌రావు, రాంమోహన్‌రావు; టీఆర్‌ఎస్‌ మండల నాయకులు లక్ష్మణ్‌రావు, గోపాల్‌రావు, చిన్నయ్య, రాజేందర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.
8న మంత్రి హరీశ్‌రావు రాక
 మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకంలో భాగంగా రెండో రిజర్వాయర్‌ జొన్నలబొగుడ వద్ద ఈనెల 8న మొదటి మోటారును ప్రారంభించేందుకు గాను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు రానున్నట్లు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆరోజు నిర్వహించే బహిరంగ సభ కోసం స్థలాన్ని పరిశీలించారు. గురువారం ఉదయం 11గంటలకు జొన్నలబొగుడ రిజర్వాయర్‌ వద్ద మంత్రి మోటారును ప్రారంభించిన అనంతరం కార్యకర్తలు, రైతులను ఉద్దేశించి బహిరంగ సభలో ప్రసంగిస్తారన్నారు. దీనికి కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి రైతులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. 
 

Advertisement
Advertisement