కస్తూరిబా గిరిజన బాలికల పాఠశాలలో తాగునీటి ఎద్దడి | Sakshi
Sakshi News home page

కస్తూరిబా గిరిజన బాలికల పాఠశాలలో తాగునీటి ఎద్దడి

Published Tue, Jul 26 2016 12:38 AM

Water scarcity in the tribal Kasturba Girls' School

నల్లమాడ:  స్థానిక కస్తూర్భా గిరిజన బాలికల పాఠశాల్లో  తాగునీటి ఎద్దడి తీవ్రమయింది. పాఠశాల్లో 6వ తరగతి నుంచి 10 వరకు 200 మంది విద్యార్థినులు ఉన్నారు.  సంవత్సరం నుంచి తాగునీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు విద్యార్థినిలు, వంట మనుషులు వాపోయారు. పాలకులకు, అధికారులను పలుమార్లు తెలియజేసినా ప్రయోజనం లేదన్నారు. పిల్లల స్నానం, దుస్తులు శుభ్రం చేసుకోవడానికి, బాత్‌రూంకు వెళ్లాలంటే చాలా కష్టంగా ఉందన్నారు. ర క్షిత నీటి పథకంలో భూగర్భజలాలు అడుగంటి పోవడంతో చుక్క నీరు రావడం లేదన్నారు. బయట నుంచి బిందెలతో నీరు తెచ్చుకుని దాహం తీర్చుకుంటున్నట్లు చెప్పారు. పాలకులు, అధికారులు స్పందించి తాగు నీటి సమస్యను పరిష్కరించాలన్నారు. పాఠశాల ఎస్‌ఓ వెంకటరమణమ్మను తాగునీటి సమస్యపై వివరణ కోరగా పాఠశాల ఆవరణలోని బోరులో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో చుక్క నీరు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు.  

 

Advertisement
Advertisement