సీఎం న్యాయం చేస్తాడన్న నమ్మకం ఉంది | Sakshi
Sakshi News home page

సీఎం న్యాయం చేస్తాడన్న నమ్మకం ఉంది

Published Mon, Oct 3 2016 12:11 AM

సీఎం న్యాయం చేస్తాడన్న నమ్మకం ఉంది

– బెల్లి లలిత సోదరు కృష్ణ
బొమ్మలరామారం : ముఖ్యమంత్రి కేసీఆర్‌ తమకు న్యాయం చేస్తాడనే నమ్మకం ఉందని బెల్లి లలిత సోదరుడు బెల్లి కృష్ణ తెలిపారు. ఆదివారం మండల కేంద్రం మీదుగా హైదరాబాద్‌ వెళ్తూ ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ను గత ప్రభుత్వాలే పెంచి పోషించాయన్నారు. ఏ ప్రభుత్వం చేయలేని సాహసోపేతమైన కార్యాన్ని ఈ ప్రభుత్వం చేసిందన్నారు. నయీమ్‌ను మట్టు పెట్టడం పట్ల హర్షం వ్యక్త చేస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో తనతో పాటు తన కుటుంబ సభ్యులు కీలక పాత్ర పోషించారన్నారు. ముఖ్యమంత్రిని కలిసే అవకాశం వస్తే తన గోడు వెళ్లబోసుకుంటానన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో ప్రాణ భయం లేకుండా బతుకుతామన్నారు. తన కుటుంబం చిన్నాభిన్నం కావడానికి నయీమ్‌ ముఠాయే కారణమన్నారు. నయీమ్‌కు తనకు ఎలాంటి ృపత్యక్ష విరోధం లేదని, తన సోదరి హత్య తరువాత ప్రాణ భయంతోనే అజ్ఞాతంలోకి వెళ్లానన్నారు. నయీమ్‌ చేసిన భూ కబ్జాలపై సమగ్ర విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు.
 

Advertisement
Advertisement