కనీస పెన్షన్ 40 శాతం పెంచాలి | Sakshi
Sakshi News home page

కనీస పెన్షన్ 40 శాతం పెంచాలి

Published Thu, Jan 19 2017 10:30 PM

We need to increase the minimum pension to 40 percent

గోదావరిఖని : కనీస పెన్షన్  40శాతం పెంచేలా త్వరలో జరగనున్న 10వ వేజ్‌బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని ఫెడరేషన్  ఆఫ్‌ కోల్‌ ఇండస్ట్రీ రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్  అధ్యక్షుడు జేఎన్  సింగ్, సింగరేణి రిటైర్డ్‌ ఆఫీసర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్ అధ్యక్షుడు పి.వాసుదేవరావు, ప్రధాన కార్యదర్శి, సింగరేణి మాజీ డైరెక్టర్‌ జేవీ దత్తాత్రేయులు కోరారు. బుధవారం సాయంత్రం ఆర్‌సీఓఏ క్లబ్‌ ఆవరణలో రిటైర్డ్‌ ఉద్యోగులు, అధికారులతో సమావేశం నిర్వహిం చారు. వారు మాట్లాడుతూ రిటైర్డ్‌ కార్మికులకు వైద్యం అందించేందుకు స్మార్ట్‌కార్డులు అం దజేయాలన్నారు.

పెన్షన్  ట్రస్టు రూ.4 వేల కోట్ల అప్పుల్లో ఉందని ప్రభుత్వం, యాజమాన్యాలు చేస్తున్న వాదనను వారు ఖండించారు. సమావేశంలో కోల్‌మైన్స్  పెన్షనర్స్‌ అసోసియేషన్  అధ్యక్షుడు కేఆర్‌సీరెడ్డి, సింగరేణి రిటైర్డ్‌ ఆఫీసర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్  నాయకులు జి.మహేశ్వర్‌రావు, టీబీజీకేఎస్‌ ప్రధాన కార్యదర్శి కెంగెర్ల మ ల్లయ్య, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు రాజిరెడ్డి, బీఎంఎస్‌ కేంద్ర ఉపాధ్యక్షుడు పి.నాగరాజు,  తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement