ఎన్ని కష్టాలొచ్చినా.. ఆత్మహత్య చేసుకోం | Sakshi
Sakshi News home page

ఎన్ని కష్టాలొచ్చినా.. ఆత్మహత్య చేసుకోం

Published Sun, Nov 15 2015 1:29 AM

ఎన్ని కష్టాలొచ్చినా.. ఆత్మహత్య చేసుకోం - Sakshi

♦ ‘మా ఊరి పెళ్లి’లో రైతు దంపతులతో ప్రమాణ ం
♦ రైతు ఆత్మహత్యల నివారణకు ‘స్లేట్’ పాఠశాల ఉద్యమం
 
 చేవెళ్ల రూరల్: రైతు ఆత్మహత్యల నివారణ కోసం హైదరాబాద్‌కు చెందిన ‘స్లేట్’ పాఠశాల విద్యార్థులు బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం రంగారెడ్డి జిల్లా దామరగిద్ద గ్రామంలో ‘మా ఊరి పెళ్లి’ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. పాఠశాల కరస్పాండెంట్ వాసిరెడ్డి అమర్‌నాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 800 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘వర్షాభావ పరిస్థితుల్లో రైతులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, ఆత్మహత్యలు చేసుకుని కుటుంబాలను వదలి పోవద్దంటూ’ పలువురు విద్యార్థులు గంటపాటు ఆడి పాడి, వారిలో చైతన్యాన్ని నింపారు.

అంతకు ముందు గ్రామంలోని దంపతులకు పసుపు, కుంకుమ, చీర, పంచె, కండువాలను అందించారు. రైతు దంపతులతో దండలు మార్పించి, ఎన్ని కష్టాలెదురైనా.. ఆత్మహత్యలు చేసుకోబోమని ప్రమాణం చేయించారు. దామరగిద్ద గ్రామంలో అప్పులబాధతో ఆత్మహత్యలకు పాల్పడిన రెండు రైతు కుటుంబాలకు రూ. 25 వేల చొప్పున ఆర్థికసాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మధుసూదన్‌గుప్తా,‘స్లేట్’ పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement