కమల్‌కాంత్‌ పాండే ఎక్కడ? | Sakshi
Sakshi News home page

కమల్‌కాంత్‌ పాండే ఎక్కడ?

Published Fri, Jan 27 2017 1:00 AM

కమల్‌కాంత్‌ పాండే ఎక్కడ? - Sakshi

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఈ ఫొటోలోని వ్యక్తి పేరు కమల్‌కాంత్‌ పాండే. ఈయనది ముంబై. రెండేళ్ల క్రితం కుటుంబ సభ్యులపై అలిగి ఇల్లు వదిలి వచ్చే శాడు. ఉన్నతంగా బతికిన ఆయన ఏపీలోని కర్నూలులోని రైల్వే స్టేషన్‌లో బిచ్చెమెత్తుకొని జీవనం సాగించడం ప్రారంభించాడు. కుటుంబ సభ్యులు ఆయన కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆశలు వదిలేసుకు న్నారు. ఈ తరుణంలో ‘ఫేస్‌బుక్‌’ అనాథగా ఉన్న కమల్‌కాంత్‌ ఫొటోను ఆయన కుమారుడికి చేరవేసింది. గత డిసెంబర్‌లో కర్నూలు జిల్లా ఎస్పీ అకే రవికృష్ణ తానా ఆధ్వర్యంలో అనాథ వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. పత్రికల్లో వచ్చిన ఆ ఫొటో క్లిప్పింగ్‌ ప్రధాని నరేంద్ర మోదీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌కు చేరింది. దీనిపై ఓ హిందీ పత్రిక వృద్ధుల చలి వ్యథలపై కథనాన్ని ప్రచురించింది.

ఆ వార్తను చదివిన కమల్‌కాంత్‌ పాండే కుమారుడు తన తండ్రిని గుర్తు పట్టాడు. వెంటనే ఆ ఫొటో మూలాలను పరిశీలించి కర్నూ లు పోలీసులను సంప్రదించాడు.  ప్రస్తుతం కమల్‌ కర్నూలు రైల్వే స్టేషన్‌లో కనిపించట్లేదు. దీంతో డోన్, వెల్దుర్తి, ఇతర రైల్వే స్టేషన్ల లో కమల్‌ ఆచూకీ కోసం అన్వేషి స్తున్నారు. దీనిపై ఎస్పీ గురువా రం విలేకరులతో మాట్లాడుతూ.. ఎవరికైనా కమల్‌ ఆచూకీ తెలిస్తే తెలియజేయాలని కోరారు.

Advertisement
Advertisement