ఎందుకు ఈ వివక్ష? | Sakshi
Sakshi News home page

ఎందుకు ఈ వివక్ష?

Published Sat, Nov 26 2016 3:53 AM

ఎందుకు ఈ వివక్ష? - Sakshi

తమ నియోజకవర్గాలపై నిర్లక్ష్యం తగదంటూ నిరసన
సీఎంను కలిసి సమస్యలు నివేదించిన వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెలక
పింఛన్లు, అభివృద్ధి  పనులపై వినపతిపత్రం

 తిరుపతి ప్రతినిధి:  ‘నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు మీరు నిధుల్విడంలేదు. రెండేళ్లుగా ఇదే పరిస్థితి. అర్హత కలిగిన వారికి పింఛన్లు కూడా మంజూరు చేయలేకపోతున్నాం. ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యులపై ఎందుకీ వివక్ష’ అంటూ జిల్లాకు చెందిన పలువురు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును నిలదీశారు. శుక్రవారం సాయంత్రం విజయవాడ వెళ్లిన వీరు ముఖ్యమంత్రిని ఆయన కార్యాలయంలో కలిశారు. ఎమ్మెల్యేలకు కేటారుుంచే అభివృద్ధి నిధులపై నిలదీశారు.

పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డికి తాజాగా 3,232 పింఛన్లు మంజూరు చేయడమేగాకుండా రూ.11.5 కోట్ల నిధులను అభివృద్ధి పనుల కోసం కేటారుుంచడాన్ని వివరిస్తూ ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యులకు కేటారుుంపులు లేకపోవడం ఏమిటని అడిగారు. ప్రజా సంక్షేమం కోసం పార్టీ రహితంగా కేటారుుంచాల్సిన నిధులను నిలుపుదల చేస్తే ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని నిలదీశారు. పూతలపట్టు, మదనపల్లె, చంద్రగిరి ఎమ్మెల్యేలు సునీల్‌కుమార్, దేశాయ్‌తిప్పారెడ్డి, డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కూడా అభివృద్ధి నిధులపై ప్రశ్నించారు. ఇప్పటికై నా తమ నియోజకవర్గాలకు అభివృద్ధి నిధులు కేటారుుంచాలని కోరారు. ఈ సందర్భంగా సీఎంకు ఓ వినతిపత్రాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అందజేశారు.

Advertisement
Advertisement