Sakshi News home page

చేయూతనిస్తే..నిరూపిస్తాం

Published Fri, Sep 9 2016 9:10 PM

చేయూతనిస్తే..నిరూపిస్తాం

  • ప్రభుత్వ పాఠశాలల్లో అంతంతే వనరులు
  • అయినా రాణిస్తున్న విద్యార్థులు
  • వసతులు కల్పిస్తే పతకాలు ఖాయమంటున్న పీఈటీ
  • కరీంనగర్‌ స్పోర్ట్స్‌ : చాలీచాలని కిట్లు, ఎగుడు దిగుడు మైదానాలు.. పీఈటీలు ఉన్న క్రీడా పీరియడ్స్‌ తక్కువే..అయినా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు గ్రామీణ క్రీడల్లో రాణిస్తున్నారు. ఇన్నీ అసౌకర్యాల మధ్యే ఇంత రాణిస్తున్న తమకు మెరుగైన వసతులు కల్పిస్తే అద్భుత ఫలితాలు సాధిస్తామని క్రీడాకారులు పేర్కొంటున్నారు. వెన్నుదన్నుగా నిలిస్తే రత్నాల్లాంటి క్రీడాకారులను తయారు చేస్తామని పీఈటీలు తెలుపుతున్నారు. అంతంతే ఉన్న వసతులతోనే అక్కడి విద్యార్థులు వ్యాయామ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో సత్ఫలితాలు సాధిస్తున్నారు. మరిన్నీ వసతులు, వనరులు కల్పిస్తే ఉత్సాహంతో పాల్గొంటామని చెబుతున్నారు. 
    సాఫ్ట్‌బాల్‌ అదుర్స్‌
    గ్రామీణ క్రీడలంటే ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్‌ మాత్రమే గుర్తొసాయి. అయితే వనరులు కల్పిస్తే ఖరీదైన సాఫ్ట్‌బాల్‌ క్రీడలోనూ రాణిస్తామని నిరూపిస్తున్నారు మానకొండూర్‌ మండలం వేగురుపల్లి విద్యార్థులు. అన్ని క్రీడాంశాలకు సంబంధించిన కిట్లు మంజూరు చేసి శిక్షణ ఇప్పిస్తే నాణ్యమైన క్రీడాకారులను వెలికితీయెుచ్చని పీఈటీలు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా పలువురి పీఈటీల అభిప్రాయాలు.
    ప్రోత్సహించాలి
    ఏటా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణిస్తున్నారు. వీరికి మరింత ప్రోత్సాహం అందిస్తే మరిన్ని ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. విద్యలో రాణించిన వారికి ప్రతిభ అవార్డులు ఎలా ఇస్తారో క్రీడల్లో రాణించిన వారికి అలాంటి అవార్డులు ఇస్తే బాగుంటుంది.  
    – శ్రీలక్ష్మి, జెడ్పీ పాఠశాల మన్నెంపల్లి
    పీఈటీలు ఉండాలి
    క్రీడల్లో సత్తా చూపాలంటే ముందుగా అన్ని పాఠశాలల్లో పీఈటీలు ఉండేలా చూడాలి. అప్పుడే పాఠశాలల్లో క్రీడాప్రణాళికలు అమలు చేసే అవకాశం ఉంటుంది.  
    – ఎల్‌.ర మణ, జెడ్పీ పాఠశాల 
    స్పెషల్‌ గ్రాంట్‌ ఇవ్వాలి 
    ఏటా పాఠశాలలకు ఇస్తున్న గ్రాంట్‌ మాదిరిగానే క్రీడ సామగ్రి కొనుగోలు కోసం ప్రత్యేక గ్రాంట్‌ ఇవ్వాలి. అంతేకాకుండా విద్యార్థులను మండల, జోన్, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకుల తీసుకెళ్లేందుకు స్పెషల్‌ గ్రాంట్‌ విడుదల చేస్తే బాగుంటుంది.  
    – గిన్నె లక్ష్మణ్, జెడ్పీ పాఠశాల ఆసిఫ్‌నగర్‌ 
    ఆటల పీరీయడ్‌ ఉండాలి
    కొన్ని పాఠశాలల్లో గేమ్స్‌ పీరియడ్స్‌ అమలు కావడంలేదు. గేమ్స్‌ పీరియడ్‌లు అనగానే విద్యార్థుల్లో ఎనలేని ఆనందం వస్తుంది. ఎప్పుడో ఒకసారి సమయం కేటాయిస్తున్నారు. టైం ప్రకారం పీరియడ్స్‌ ఉంటే విద్యార్థులు క్రీడల్లో రాణించేలా తీర్చిదిద్దగలం. ప్రభుత్వం కొత్త ప్లాన్‌లు రూపొందించాలి.
    – రూపారాణి, రుద్రారం జెడ్పీ పాఠశాల 
    కిట్‌లు మంజూరు చేయాలి
    ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఆడుకోవడానికి క్రీడాపరికరాలు కూడా ఉండవు. అయినా నేర్పిద్దామంటే మైదానం సరిగ్గా ఉండదు. వారిష్టమున్న ఆట ఆడుదామంటే సౌకర్యాలు, కిట్‌లు ఉండవు. ఇవన్నీ సమకూర్చితే మంచి ఫలితాలు వస్తాయి.
    – బిట్ర శ్రీనివాస్, చామనపల్లి జెడ్పీ పాఠశాల 
    ప్రోత్సాహకాలు అందించాలి
    ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అద్భుతంగా రాణిస్తున్నారు. జాతీయ, రాష్ట్రస్థాయిల్లో విజయాలు సాధిస్తున్నారు. అలాంటి వారికి స్కాలర్‌షిప్‌లు ఇచ్చి ప్రోత్సహిస్తే అద్భుత ఫలితాలు సాధిస్తారు.  
    – ఎండీ యూనిష్‌పాషా, వేగురపల్లి
    స్పోర్ట్స్‌ కోటా పెంచాలి
    స్పోర్ట్స్‌ కోటా పెంచితే మరింత మంది క్రీడాకారులు వస్తారు. 2 శాతం క్రీడా కోటా ఉన్నప్పటì కీ దానిని అమలు చేయడంలో విఫలమవుతున్నారు. క్రీడా కోటాను అమలు చేయడంతోపాటు మరికొంత పెంచాలి.  
    – సత్యానంద్, రాగంపేట్‌
    క్రీడా ప్రణాళిక చేయాలి 
    ప్రభుత్వ పాఠశాలలో సాదారణ విద్యలో భాగంగా క్రీడలను భాగం చేయాలి. స్పోర్ట్స్‌ ప్రణాళిక రూపొందించాలి. కొన్ని పాఠశాలల్లో వ్యాయామవిద్యకు గుర్తింపే లేదు. వ్యాయామ విద్యను గుర్తించినప్పుడే విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటారు. 
    – జ్యోతి, గోపాల్‌రావుపేట
     
     

Advertisement

తప్పక చదవండి

Advertisement