మద్యం రేట్లను పెంచిన ప్రభుత్వం | Sakshi
Sakshi News home page

మద్యం రేట్లను పెంచిన ప్రభుత్వం

Published Tue, Feb 14 2017 11:39 PM

wine prises heavy yanam government

యానాం :
 పుదుచ్చేరికి ప్రధాన ఆదాయవనరుగా ఉన్న మద్యంపై అడిషనల్‌ ఎక్సైజ్‌డ్యూటీని(ఏఈడీ) మంగళవారం పెంచడంతో ధరలు పెరిగాయి. స్పిరిటోరియస్‌ లిక్కర్, విదేశీ తయారీ లిక్కర్, ఇండియా తయారీ విదేశీ మద్యం బ్రాండ్‌లకు 25 శాతం మేర ఎక్సైజ్‌ డ్యూటీని పెంచారు. దీంతో ప్రభుత్వానికి రూ.15 కోట్ల మేర ఆదాయం లభించనుందని అంచనా వేస్తున్నారు. 2013లో పెంచిన ఎౖMð్సజ్‌ డ్యూటీని మళ్లీ ఇప్పుడు పెంచారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.700 కోట్లు ఆదాయం లక్ష్యంగా నిర్ణయించారు. మద్యం రేట్లు పెంచినప్పటికి సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు కన్నా తక్కువగానే ఉన్నాయని చెబుతున్నారు. నోట్ల రద్దు ప్రభావం టూరిజంపై పడిన నేపథ్యంలో లిక్కర్‌ అమ్మకాలు మందగించాయి. దీంతో అదనపు డ్యూటి ద్వారా ఆదాయం రాబట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
 

Advertisement
Advertisement