527 మద్యం దుకాణాలకు గ్రీన్‌సిగ్నల్‌ | Sakshi
Sakshi News home page

527 మద్యం దుకాణాలకు గ్రీన్‌సిగ్నల్‌

Published Sat, Apr 1 2017 12:30 AM

wine shops notification

6,317 దరఖాస్తుల ద్వారా రూ.39.66 కోట్ల ఆదాయం 
సింగిల్‌ దుకాణాలు –42 
ఇంకా 18 దుకాణాలకు మళ్లీ నోటిఫికేష¯ŒS
 
కాకినాడ క్రైం: 
తూర్పు గోదావరి జిల్లాలో 2017–19 సంవత్సరానికి 527 మద్యం దుకాణాల ఏర్పాటుకు ఎక్సైజ్‌ అధికారులు లైసెన్సులు జారీ చేశారు. 545 దుకాణాలకు నోటిఫికేష¯ŒS వెలువడగా 527 దుకాణాలకు 6,545 మంది వ్యాపారస్తుల నుంచి ఆ¯ŒSలైన్లో దరఖాస్తు  చేసుకోగా 232 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలోని 18 దుకాణాలకు వ్యాపారుల నుంచి ఒక్క టెండర్‌ కూడా దాఖలు కాలేదు. 42 మద్యం దుకాణాలకు ఒక్కో దరఖాస్తు రావడంతో వీటికి అధికారులు ఎటువంటి లాటరీ నిర్వహించకుండా నేరుగా లైసెన్సులు జారీ చేశారు. మిగతా మద్యం దుకాణాలకు లాటరీ ద్వారా లైసెన్సులు  జారీ చేశారు. 
కోలాహలంగా దుకాణాలకు లాటరీ
ప్రభుత్వం ప్రకటించిన కొత్త మద్యం పాలసీ ప్రకారం ఏప్రిల్, జూలై ఒకటో తేదీ నుంచి జిల్లాలో 527 మద్యం దుకాణాల ఏర్పాటుకు లైసెన్సుల జారీ ప్రక్రియను శుక్రవారం కాకినాడ ఎ¯ŒSఎఫ్‌సీఎల్‌ రోడ్డులోని జీ కన్వెన్ష¯ŒS హాల్లో ఎౖMð్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌ బి. అరుణారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. సుప్రీంకోర్టు తీర్పుననుసరించి జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల అవతల మద్యం దుకాణాలు ఉండేలా ఎక్సైజ్‌ అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం ఎక్సైజ్‌ యూనిట్‌ పరిధిలోని మద్యం దుకాణాల ఏర్పాటుకు లైసెన్సులను జిల్లా పంచాయతీ అధికారి టీవీజీఎస్‌ కుమార్, డీఆర్‌డీఏ పీడీ మల్లిబాబుల ఆధ్వర్యంలో ఎౖMð్సజ్‌ అధికారులు జారీ చేశారు. తొలుత సింగిల్‌ దరఖాస్తులు వచ్చిన వ్యాపారులకు ఎటువంటి లాటరీ నిర్వహించకుండా లైసెన్సులు జారీ చేశారు. అనంతరం ఒకటి కంటే ఎక్కువ వచ్చిన టెండర్లకు లాటరీ నిర్వహించి, విజేతలకు లైసెన్సు జారీ చేశారు. 
లాటరీ నిర్వహించిన దుకాణాలకు ఒక విజేతతో పాటు రిజర్వులో మరొకర్ని ఎంపిక చేశారు. తొలుత కేటాయించిన వ్యాపారుస్తుడు అనివార్య కారణాల వల్ల  లైసెన్సు ఫీజు చెల్లించకపోయినా, బ్యాంకు గ్యారంటీ ఇవ్వకపోయినా ప్రత్యామ్నాయంగా దుకాణం కేటాయించేందుకు అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఫస్ట్‌ ఫోర్‌లో తూర్పున అమలాపురం డివిజ¯ŒSకి డీఆర్‌డీఏ పీడీ మల్లిబాబు, కాకినాడ యూనిట్‌కి డీపీవో కుమార్‌ల ఆధ్వర్యంలో లాటరీ నిర్వహించి వ్యాపారులకు లైసెన్సులు జారీ చేశారు. మద్యం దుకాణాల ఏర్పాటుకు నిర్వహించిన లాటరీలో సుమారు 50 మంది మహిళలు అత్యంత హుషారుగా పాల్గొనటం విశేషం. 
18 దుకాణాలకు మళ్లీ నోటిఫికేష¯ŒS జారీ
జిల్లాలో మిగిలిపోయిన 18 మద్యం దుకాణాలకు రెండోసారి నోటిఫికేష¯ŒS విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎక్సైజ్‌ డీసీ అరుణారావు వెల్లడించారు. రీ నోటిఫికేష¯ŒS కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనున్నట్టు చెప్పారు. జిల్లాలో కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం యూనిట్ల పరిధిలో రాత్రి 10 గంటల సమయానికి 350 మద్యం దుకాణాల ఏర్పాటుకి వ్యాపారస్తులకు లైసెన్సులు జారీ చేసినట్లు ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్‌ బి.అరుణారావు వెల్లడించారు. మిగతా షాపులకి శనివారం తెల్లవారుజాము దాకా లైసెన్సుల జారీ పూర్తయ్యే దాకా నిరంతరం  కొనసాగుతుందన్నారు. 
 
దరఖాస్తులిలా....
మద్యం దుకాణాల ఏర్పాటుకు మున్సిపల్‌ కార్పొరేష¯ŒS నుంచి 326 దరఖాస్తులు, మున్సిపాలిటీల నుంచి 219, నగర పంచాయతీల నుంచి 138, మండలాల నుంచి 5,598 దరఖాస్తులు ఆ¯ŒSలైన్లో వచ్చాయి. రంపచోడవరం పరిధిలోని 15 మద్యం దుకాణాలకు 736 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో చింతూరులో షాపు నెంబర్‌ 538 దుకాణానికి 102 దరఖాస్తులు రావడం విశేషం. అలాగే 538 దుకాణానికి 96 దరఖాస్తులు వచ్చాయి. దేవీపట్నంలో 20 వ షాపుకి 77 దరఖాస్తులు రాగా, వీఆర్‌ పురంంలో షాపునెంబర్‌ 540 కి 56 దరఖాస్తులు వచ్చాయి. కూనవరంలో 542 షాపుకి 66 దరఖాస్తులు వచ్చాయి. రాజమహేంద్రవరం నార్త్‌ పరిధిలోని 427 దుకాణానికి 30 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.ఇవికాకుండా ప్రత్తిపాడులో 159 దుకాణానికి 62 దరఖాస్తులు రాగా, తునిలో 177,178 దుకాణాలకు తలో 30, సామర్లకోటలో 102 దుకాణానికి 54 దరఖాస్తులు వచ్చాయి.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement