ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్యాయత్నం | Sakshi
Sakshi News home page

ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్యాయత్నం

Published Tue, Jul 26 2016 1:44 AM

woman suicide attempt

ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్యాయత్నం 
 
ఏలూరు అర్బన్‌ : ఓ వివాహిత ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కామవరపుకోట మండలం వీరిశెట్టిగూడెంకు చెందిన చెల్లబోయిన లక్ష్మీకాంతంకు దాదాపు పదిహేళ్ల కిందట వివాహం జరిగింది. భర్త లక్ష్మణస్వామి ఉద్యోగం నిమిత్తం సౌదీలో ఉంటూ అప్పుడప్పుడూ ఇండియా వచ్చి వెళుతుంటాడు. దీంతో బాధితురాలు తన ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిదండ్రుల వద్దే ఉంటుంది.  ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి లక్ష్మీకాంతం ఇంటిలో  ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. దీనిని గమనించిన కుటుంబసభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం విజయవాడ రిఫర్‌ చేశారు.
 

 

Advertisement
Advertisement