వివాహిత ఆత్మహత్యాయత్నం | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్యాయత్నం

Published Tue, Dec 6 2016 12:08 AM

woman suiside attmept


రొద్దం : చిన్నమంతూరుకి చెందిన గంగమ్మ (30)అనే వివాహిత సోమవారం ఆత్మహత్యాయత్నం చేసింది. గ్రామస్తులు తెలిపిన మేరకు.. ఉదయం ఇంటిలో ఎవరూలేని సమయంలో ఆమె ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. స్థానికులు గమనించి మంటలు ఆర్పివేశారు. 50 శాతం కాలిన గాయాలతో ఉన్న ఆమెను హిందూపురం ఆస్పత్రికి తరలించారు. కడుపునొప్పి భరించలేకే తాను ఆత్మహత్యాయత్నం చేసినట్లు గంగమ్మ పోలీసులకు తెలిపింది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement