మలినేనిలో సర్వేయింగ్‌పై వర్క్‌షాపు | Sakshi
Sakshi News home page

మలినేనిలో సర్వేయింగ్‌పై వర్క్‌షాపు

Published Sun, Jul 31 2016 4:01 PM

మలినేనిలో సర్వేయింగ్‌పై వర్క్‌షాపు

సింగరాయకొండ: మలినేని లక్ష్మయ్య ఇంజనీరింగ్‌ కాలేజిలో శనివారం అధునాతన సర్వేయింగ్‌ విధానంపై మూడు రోజుల వర్క్‌షాపు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రిసోర్స్‌పర్సన్‌గా వ్యవహరించిన కొడాలి శ్రీనివాసరావు సివిల్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులకు టోటల్‌ స్టేషన్, జీపీఎస్‌ లాంటి అధునాతన టెక్నాలజీని ఉపయోగించి నూతన సర్వేయింగ్‌ విధానాన్ని ఎలా చెయ్యాలో శిక్షణ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్‌ఫ్రాస్టక్చర్‌ రంగంలోని ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయిస్తున్నందున రాబోయే రోజుల్లో సర్వేయింగ్‌కు మంచి డిమాండ్‌ ఉందని కాలేజి ప్రిన్సిపాల్‌ టి. క్రిష్ణయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజి ఇన్‌చార్జి చైర్మన్‌ ఎస్‌. బ్రహ్మయ్య, డైరెక్టర్‌ పూర్ణచంద్రరావు, సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగాధిపతి పి. వరుణ్, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement