రైల్లోంచి పడి యువకుడు మృతి | Sakshi
Sakshi News home page

రైల్లోంచి పడి యువకుడు మృతి

Published Fri, Nov 11 2016 12:11 AM

రైల్లోంచి పడి యువకుడు మృతి - Sakshi

తీవ్రగాయాలతో కొద్ది దూరం కలయతిరిగిన వైనం   
చేనిగుంట (తడ) : రైల్లోంచి జారిపడి జార్కండ్‌ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు మృతి చెందాడు.ఈ సంఘటన  మండలంలోని చేనిగుంట వద్ద గురువారం జరిగింది. అయితే ఆ యువకుడు రైల్లోంచి జారి తీవ్ర గాయాలతో సాయం కోసం వచ్చేందుకు అటూ ఇటూ కొద్ది దూరం కలయతిరిగినట్లు తెలుస్తోంది. రైల్వే ట్రాక్‌కు 150 మీటర్ల దూరంలో పొలం గట్టుపై మృతి చెంది ఉండగా స్థానికులు హత్యగా అనుమానించి రెవెన్యూ, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సీఐ టీ విజయకృష్ణ, తడ ఎస్‌ఐ ఏ సురేష్‌బాబు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి ఒంటిపై ఎలాంటి ఎలాంటి దుస్తులు లేవు. మృతుడికి సమీపంలో ఫ్యాంట్‌, టీ షర్ట్‌, పర్సు పడి ఉన్నాయి. చెన్నై వైపు వెళ్లే మార్గంలో 73వ కిలోమీటరు వద్ద రక్తపు మరకలు ఉన్నాయి. అక్కడ చెప్పులు పడి ఉండగా, ట్రాక్‌కు సుమారు 150 మీటర్ల దూరంలో టీ షర్ట్‌ పడి ఉంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మతిస్థిమితం కోల్పోయి సాయం అటూ ఇటూ కలయతిరిగినట్లు ఉంది. మృతుడికి సంబంధించి దుస్తుల వద్ద లభించిన పర్సులో హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఆధారంగా అతన్ని వివరాలు గుర్తించారు. జార్కండ్‌ రాష్టం రాంచీలోని రోయిరోడ్డుకి చెందిన హనుమంత మెహతా కుమారుడు షాంబు మెహతా(25)గా నిర్ధారించారు. మృతదేహాన్ని సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి, శీతల గదిలో భద్రపరిచారు.  బంధువులకు సమాచారం అందించారు.వారు వచ్చాక పోస్టుమార్టం అనంతరం అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement