Sakshi News home page

యువకుడు ఆత్మహత్య

Published Wed, Oct 19 2016 12:08 AM

youth suicide

అనంతపురం సెంట్రల్‌ : అనంతపురం నీరుగంటి వీధిలో నివసిస్తున్న శ్రీనివాసరావు కుమారుడు రవితేజ(20) మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్లు వన్‌టౌన్‌ పోలీసులు తెలిపారు. ఇంట్లోని తన గదిలో చీరతో ఉరేసుకుని తనువు చాలించినట్లు వివరించారు. అయితే ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులను కుటుంబ సభ్యులు వెల్లడించడం లేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement
Advertisement