Sakshi News home page

వివాహానికి హాజరైన వైఎస్ జగన్

Published Sun, Oct 25 2015 10:30 PM

వివాహానికి హాజరైన వైఎస్ జగన్ - Sakshi

అనంతపురం: వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథరెడ్డి, అరుణ దంపతుల కుమారుడు నరేన్ రామాంజులరెడ్డి, అదే జిల్లా చెన్నూరు వాసి రాజారెడ్డి వెంకటసుబ్బారెడ్డి కుమారై నవ్యతేజల వివాహానికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. వీరి వివాహం ఆదివారం అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురంలోని గంగా నిలయం కల్యాణ మండపంలో జరిగింది. వైఎస్ జగన్‌తో పాటు సతీమణి వైఎస్ భారతి, తల్లి విజయమ్మ, సోదరి షర్మిల, చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. నూతన వధూవరులకు అక్షింతలు వేసి వైఎస్ జగన్ ఆశీర్వదించారు.

గుంతకల్లులోనే జరిగిన మరో వివాహ వేడుకకు వైఎస్ జగన్ హాజరై నూతన వధూవరులు సింధు, అమరనాథరెడ్డిలను ఆశీర్వదించారు. అలాగే గుంతకల్లు మండలం ఓబుళాపురానికి చెందిన రామాంజనేయులు, సునీత కుమారుడికి రఘు అని పేరు పెట్టారు. కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, శాసనమండలి విపక్షనేత రామచంద్రయ్య, ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, చాంద్‌బాషా, గుమ్మనూరు జయరాం, సాయిప్రసాదరెడ్డి, ఐజయ్య, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, గుంతకల్లు సమన్వయకర్త వెంకట్రామిరెడ్డి, డీసీసీబీ చైర్మన్ శివశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement